స్థానిక ఎన్నికలపై వైసీపీ సంచలన నిర్ణయం !

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహాలం మొదలైంది. ఈ ఎన్నికలని అన్ని ప్రధాన పార్టీలు కూడా కీలకంగా భావించి పక్కా ప్రణాళికలతో రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికలని వైసీపీ టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల పోటీ లో నిలపవద్దని వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీచేసింది.

ఒకేవేళ ఎవరైనా పార్టీ ఆదేశాల్ని పక్కన పెట్టి ..బంధువులని పోటీలో నిలిపితే వారికి బీఫామ్లు ఇవ్వకూడదని రీజినల్ కోఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే కొద్దిసేపటి క్రితమే ఎంపీటీసీ జడ్పీటీసీ కి నామినేషన్స్ దాఖలు చేయడానికి సమయం ముగిసింది. మొత్తంగా 660 జడ్పీటీసీ 9984 ఎంపీటీసీ స్థానాలకు 21న ఎన్నికల నిర్వహించనున్నారు. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లని రేపు నామినేషన్లను పరిశీలించనునాన్నరు. ఆ తరువాత ఈనెల 14న తుది జాబితాను ప్రకటించి 21 న ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే మార్చి 24న ఫలితాలను ప్రకటించనున్నారు.

ఇకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ కి నామినేషన్స్ దాఖలు చేయడానికి సమయం బుధవారం సాయంత్రం 5 గంటలకి ముగియగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటినుంచిప్రారంభమైంది. ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 13 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తరువాత నామినేషన్లని పరిశీలించి మార్చి 23న ఎన్నికలని నిర్వహించనున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *