స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రులు కీలకంగా వ్యావహారించాలి :సీఎం జగన్

త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వీటికోసం అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే టీడీపీ మొదటి నుంచి స్థానికంగా బలంగా ఉంది. అధికార పార్టీ కన్నా బలంగా ఉండడంతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నిలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మద్దతుదారులే భారీ స్థానాల్లో గెలవాలని ఈ సందర్భంగా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులుగా మీ పదవి నిలబెట్టుకోవాలంటే స్థానిక ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఇటీవల తెలంగాణలో కేసీఆర్ కూడా తమ మంత్రులకు ఇలాంటి లక్ష్యం విధించి విజయవంతమయ్యారు. అందుకే జగన్ కూడా అలాంటి నిర్ణయం తీసుకుని మంత్రులకు లక్ష్యం విధించారు.

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను మార్చి 15వ తేదీలోగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ ఎన్నికల ప్రకటన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ మంత్రులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని ఆదేశించారు. సాధారణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు కూడా స్థానిక సమరంలో విజయం సాధించాలని సూచించారు. ఈ ఎన్నికల బాధ్యతను మంత్రులకు అప్పగించారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటితేనే మంత్రిగా కొనసాగే అవకాశం ఉందని పరోక్షంగా హెచ్చరించినట్లు సమాచారం.

స్థానిక ఎన్నికలపై ఇప్పటికే స్థానిక పార్టీ నాయకులు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యంగా మంత్రులకు గెలుపు బాధ్యతలను అప్పగించారు. పార్టీ మద్దతుదారుల ఎంపిక నుంచి ప్రచారం పోల్ మేనేజ్మెంట్ వంటి అంశాల దాకా అన్నీ బాధ్యతలు మంత్రులకే అప్పగించారని పార్టీ వర్గాల సమాచారం. స్థానిక నేతలు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవడం విభేదాలను పరిష్కరించడం వంటి తదితర బాధ్యతలన్నింటిని మంత్రులకే అప్పగించారు. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కకుంటే మంత్రుల పదవులు ఉండవని చెప్పడం తో జగన్ ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకం గా తీసుకున్నారో తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభుత్వ వ్యవహారాలు తమ శాఖల బాధ్యతలు పక్కన పెట్టేసి పూర్తిగా ఎన్నికలపైనే పూర్తిస్థాయి దృష్టి పెట్టాలని జగన్ స్పష్టం చేశారని సమాచారం. ఇంచార్జ్ మంత్రులతో పాటు స్థానిక మంత్రులు జిల్లాలకే పరిమితమై ఎన్నికల కసరత్తు పూర్తి చేయాలని సీఎం జగన్ నిర్దేశించారంట. జగన్ ఆదేశాలతో మంత్రులు తమ ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. తమ ప్రాంతంలో స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించేలా వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే తమ పదవికి ఎసరు పెట్టే వ్యవహారం కావడం తో మంత్రులు కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో మంత్రులు జిల్లాలకే పరిమితమై స్థానిక ఎన్నికల వ్యవహారం పై కసరత్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *