హీరో నితిన్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు..

నితిన్ ఇక బ్యాచిలర్ షిప్ ని వదిలేస్తున్న సంగతి తెలిసిందే. యూత్ స్టార్ పెళ్లి బాజాకు ముహూర్తం ఫిక్సయ్యింది. నితిన్ తన స్నేహితురాలు షాలిని కందుకూరిని పెళ్లాడేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటి వరకూ నితిన్ పెళ్లాడే వధువు ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో అసలు క్లూ అన్నదే లేదు. తాజాగా నితిన్ ఫియాన్సీ ఫోటో ఒకటి రివీలైంది.

బ్యాచిలర్ నితిన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన షాలినికి ఎందుకు క్లీన్ బౌల్డ్ అయిపోయాడో ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది. షాలిని ఎంతో సింపుల్ గా సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తోంది. ఆ ఇద్దరికీ ఈడు జోడు కుదిరిందనే ఫ్యాన్స్ కితాబిచ్చేస్తున్నారు. ఇక షాలినితో నితిన్ పరిచయం ఆసక్తికరం. ఓ కామన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా షాలిని 2012 లో నితిన్ కి పరిచయమయ్యారు. తొలి పరిచయం అటుపై తరచుగా కలుసుకోవడం.. ఆపై ప్రేమను వ్యక్తం చేయడం చకచకా జరిగిపోలేదు. పరిచయాలు కాస్తా నెమ్మదిగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీలుపడింది. ఇకపై తమ ప్రేమను కొనసాగించాని భావించిన తర్వాత అందరిలాగా.. ఫిల్మీ స్టైల్లో మోకాలిపై కూచుని తనకు ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేయలేదు. అందుకు భిన్నంగా ఒంటి కాలిపై నిలిచి ప్రపోజ్ చేశాడట. అతడు నిలుచున్న తీరుకు షాలిని ఫక్కున నవ్వేశారట. నవ్వితే నవ్వారు కానీ.. అతడి ప్రతిపాదనకు ఎస్ అనే రిప్లయ్ వచ్చేసింది. మొత్తానికి నితిన్ ఒంటికాలిపై కొంగ జపం వర్కవుటైందన్నమాట.

తన లైఫ్ లో అత్యుత్తమమైన రోజు అది అని నితిన్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక తన సినిమాలన్నీ చూసి నిజాయితీగా రివ్యూలు చెప్పడం షాలినికి అలవాటు అన్న సంగతిని నితిన్ తాజాగా రివీల్ చేశారు. షాలిని వ్యక్తిగత వివరాలు పరిశీలిస్తే.. తను బ్రిటన్ లో ఎంబీఏ పూర్తి చేశారు. నాలుగేళ్లుగా నితిన్ తో పరిచయం ఉంది. కామన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా నితిన్ తనకు పరిచయం అయ్యాడు. అయితే ఈ నాలుగేళ్లలో ఈ జంట ప్రేమ వ్యవహారం మాత్రం రివీలైంది వెరీ రీసెంట్ అనే చెప్పాలి. ఇది లవ్ కం ఎరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు.

ఈ శనివారం హైదరాబాద్ లో ఈ జంట నిశ్చితార్థం జరగనుంది. ఏప్రిల్ 16 న దుబాయ్లోని విలాసవంతమైన స్టార్ హోటల్ పాలాజ్జో వెర్సేస్ లో వివాహం జరగనుంది. ఈ జంట ప్రీ-వెడ్డింగ్ వేడుకకు ప్రిపేరవుతున్నారు. ఫిబ్రవరి 15న నితిన్ హైదరాబాద్ నివాసంలో ఈ జంట సాంప్రదాయ పద్ధతిలో నిశ్చితార్థ వేడుకను జరుపుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *