హీరో విక్కీ కౌసిల్ తో ప్రేమతో మునిగిన కత్రినా !!

35 ఏజ్ లోనూ కత్రిన కవ్వింత గురించి చెప్పాల్సిన పనే లేదు. రెగ్యులర్ గా జిమ్-యోగాతో టోన్డ్ ఫిగర్ ని మెయింటెయిన్ చేసే ఈ భామ భారీ యాక్షన్ చిత్రాల్లో గగుర్పొడిచే యాక్షన్ విన్యాసాలతో కట్టి పడేస్తోంది. ఇంతకుముందు ధూమ్ 3- టైగర్ జిందా హై- భారత్- థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లాంటి చిత్రాల్లో కత్రిన విన్యాసాలు చూసిన వారు ఔరా! అంటూ ముక్కున వేలేసుకున్నారు.

శరీరాన్ని విల్లులా వంచేస్తూ కత్రిన మెరుపు విన్యాసాలు యాక్షన్ ఫీట్లు మైమరిపించాయి. ఇక నృత్యంలోనూ కత్రిన స్పీడ్ ఫ్యాన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. గత కొంతకాలంగా ఈ అమ్మడు ఒంటరి లైఫ్ ని బోర్ ఫీలవుతోందట. అందుకే యువ హీరో విక్కీ కౌశల్ తో నిండా ప్రేమలో మునిగిందని ఆ ఇద్దరూ సీక్రెట్ గా కలుసుకుంటున్నారని బాలీవుడ్ లో ప్రచారం అవుతోంది.

మొన్న ఆ మధ్య ముంబైలో కత్రిన ఇంటికి వెళ్లిన విక్కీ కౌశల్ తన ముఖాన్ని దాచేసుకుంటూ బయటికి వెళుతూ కెమెరా కంటికి చిక్కాడట. ప్రస్తుతం విక్కీ- కత్రిన జంట `భూత్ 1- ది హాంటెడ్ షిప్` సిరీస్ లో నటిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆ ఇద్దరూ రెగ్యులర్ గా అంథేరిలోని కత్రిన భవంతిలో కలుసుకుంటున్నారట. కొత్త జంట కొత్త స్నేహం అంటూ ఉత్తరాది మీడియా తెగ మోసేస్తోంది. ఇక కత్రిన లేటెస్ట్ ఫోటో ఒకటి అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో కత్రిన నెవ్వర్ బిఫోర్ అన్నంత హాట్ గా కనిపిస్తోంది. నాభి.. నడుము అందాల్ని ఎలివేట్ చేస్తూనే.. దేహశిరుల్ని అల్లుకుపోయిన టైట్ స్పోర్ట్ డ్రెస్ బోయ్స్ కంటికి కునుకుపట్టనివ్వదు అంటే అతిశయోక్తి కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *