హెయిర్ స్టైల్ పై ఇంతగా ప్రయోగాలేల రామా?

ఆరంభం కర్లింగ్ హెయిర్ తో వచ్చాడు.. ఆ తర్వాత సాఫ్ట్ గా మార్చాడు.. మొన్న సంక్రాంతికి రిలీజైన ఫ్లాప్ సినిమాలో ఎంతో మోడ్రన్ హెయిర్ తో కనిపించాడు.. ఇంతలోనే మళ్లీ లుక్ మార్చేశాడు… ఇప్పుడు మళ్లీ కర్లింగ్ లుక్ లోకి మారాడు.. ఏమిటీ సిత్రం? ఇంతకీ ఎవరీ కర్లింగ్ బోయ్ అంటారా? పరిచయం అవసరం లేదు. నందమూరి కళ్యాణ్ రామ్. నిర్మాత కం హీరో. దశాబ్ధాల పాటు కథానాయకుడిగా నటిస్తూనే నిర్మాతగానూ రాణిస్తున్నాడు.

తదుపరి అన్న ఎన్టీఆర్ తో ఓ సినిమాకి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి వేరొక నిర్మాణ సంస్థ తో భాగస్వామిగా మారాడు. ఇకపోతే కళ్యాణ్ రామ్ నటించే తదుపరి సినిమా ఏది? అంటే చాలానే సర్ ప్రైజ్ లు ఉండబోతున్నాయని అర్థమవుతోంది ఈ లుక్ చూస్తుంటే..!

కర్లింగ్ హెయిర్ ని బాగా పెంచాడు. దానికి హెడ్ బ్యాండు పెట్టాడు. ఆ కర్లింగ్ హెయిర్ ఇంకా భీకరంగా పెరగనుందని దీని సంకేతం. ఇక ఆ కోరమీసం.. గుబురు గడ్డం.. ఇదంతా చూస్తుంటే మరో లాల్ సింగ్ చద్దాలాగా కనిపిస్తున్నాడు. ఏమిటో నందమూరి హీరో అమీర్ లా ప్రయోగం చేసేస్తున్నాడు. ఇంతకీ ఏదైనా బయోపిక్ లో నటిస్తున్నాడా? లేదూ వారియర్ బయోపిక్ చేస్తున్నాడా? ఒకవేళ అలా నటిస్తే ఎవరి బయోపిక్ లో నటించబోతున్నాడు? ఏమో తర్వాత సినిమా ఏది? అన్నదానిపై పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉందింకా. ఇక జిమ్ ఫిట్ లుక్ లో కళ్యాణ్ రామ్ లో ఇంప్రూవ్ మెంట్ కనిపిస్తోంది. అయితే ఎంత చేస్తే ఏం లాభం? చేయాల్సింది చేయాలిగా..! తన ఆస్థానంలో రాంగ్ ప్రమోషన్స్ వ్యవహారంపై మీడియాలో గుసగుసలు వినిపించాయి. ఆ లొల్లేమిటో కళ్యాణరాముడు గుర్తించి రీప్లేస్ మెంట్ చేస్తున్నారన్న గుసగుసల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. అటుపై అయినా అతడికి గ్రాఫ్ మారుతుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *