హైదరాబాద్ బాగుంది అంట..

కన్నడ నుండి ‘ఛలో’తో తెలుగు పరిశ్రమకు దిగుమతి అయిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. అదృష్టం బాగుండి మొదటి సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఆ వెంటనే విజయ్ దేవరకొండతో గీత గోవిందం అనే చిత్రాన్ని చేయడంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా హైకు చేరింది. స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయ్యింది. మహేష్ బాబు వంటి స్టార్ తో నటించిన రష్మిక ప్రస్తుతం మరో ఇద్దరు స్టార్ హీరోలతో నటిస్తోంది. వరుసగా చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

నా వద్ద ఒక క్యూట్ కుక్క పిల్ల ఉంటుంది. ఆ కుక్కపిల్లకు పెట్టే బిస్కట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూడాలనిపించింది. అందుకే టేస్ట్ చేశాను. మరీ దారుణంగా ఏమీ లేవు అంది. తాను ఎక్కువగా లగ్జరీ లైఫ్ ను కోరుకోను. ఎప్పుడో కోపం వచ్చినప్పుడు షాపింగ్ చేయడం వల్ల కాస్త కోపంను కంట్రోల్ చేసుకుంటాను. చాలా మంది నాతో నువ్వు తెలుగు అమ్మాయివా.. మీ తల్లిదండ్రుల్లో ఎవరైనా తెలుగు వారు ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉంటారు. చూడ్డానికి తెలుగు అమ్మాయిల ఉండి తెలుగు మాట్లాడటం వల్ల అంతా నన్ను తెలుగు అమ్మాయినే అనుకుంటున్నారు. కాలేజ్ రోజుల నుండే మోడలింగ్ పై ఆసక్తి చూపించడంతో పాటు అందాల పోటీల్లో పాల్గొన్నాను. బెంగళూరుతో పాటు ముంబయిలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాను.

మోడలింగ్ చేస్తూనే చదువుకున్నాను. చదువుపై ఎక్కువ దృష్టి పెట్టిన కారణంగా పలు సినిమాలను వదిలేశాను. నన్ను ఒక అందాల పోటీలో విజేతగా చూసి కిర్రాక్ పార్టీ సినిమాలోకి తీసుకున్నారు. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే పలు ఆఫర్లు వచ్చాయి. తెలుగులో మరో రెండు సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్ లో ఇల్లు తీసుకుంటాను అంటోంది. ఇల్లు కొనుగోలు చేసి హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. తనకు హైదరాబాదీ బిర్యానీ అంటే ఇష్టం. కాని గత ఎనిమిది నెలలుగా నేను నాన్ వెజ్ మానేశాను. బిర్యానీని మిస్ అవుతున్నాను అంది.
హైదరాబాద్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కొన్ని రోడ్లను చూస్తుంటే అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడున్న లగ్జరీ లైఫ్ ఆశ్చర్యంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. హైదరాబాదీలు ఎక్కువగా నవ్వుతూ మాట్లాడతారు. అది నాకు బాగా నచ్చింది. ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి కనుక హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్న ఈ అమ్మడు ఆ తర్వాత తమిళంలో ఆఫర్లు వస్తే అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటుందేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *