హైపర్ ఆది చుట్టూ సెక్స్ రాకెట్?

జబర్దస్త్ కామెడీ షోకు తెలుగులో చాలా మంచి ఇమేజ్ ఉంది. అప్పటి వరకు కేవలం బాలీవుడ్‌లో మాత్రమే కామెడీ షోలకు డిమాండ్ ఉండేది. కానీ రియాలిటీ స్టాండప్ కామెడీ షోగా వచ్చి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది జబర్దస్త్ కామెడీ షో. ఆ తర్వాత కూడా చాలా షోలు దాన్ని అనుకరించాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డాయి. ఈ షోతో చాలా మంది నటులు ఇండస్ట్రీకి కూడా పరిచయం అయ్యారు. ఈ రోజు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి చాలా మంది కమెడియన్లు ఈ షో నుంచి ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇంకా ఎంతోమందికి జబర్దస్త్ కామెడీ షో అన్నం పెడుతుంది. ఇప్పటి వరకు కేవలం నవ్వులతోనే ఎక్కువగా పరిచయమున్న ఈ షో ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది.
ఇందులో నటించే ఇద్దరు కమెడిచన్లు ఇప్పుడు ఏకంగా వ్యభిచారం చేస్తూ.. నిర్వహిస్తూ దొరికిపోవడంతో సంచలనంగా మారింది. హైపర్ ఆది టీంలో చేసే దొరబాబు, పరదేశీ వైజాగ్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం చూస్తుంటే వీళ్లకు చాలా రోజులుగా దీనితో సంబంధం ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే జబర్దస్త్ నటుల మెడకు సెక్స్ రాకెట్ చుట్టుకోవడంతో అందర్నీ అనుమానించాల్సిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తుంది. గతంలో కూడా జబర్దస్త్ కామెడీ షోలో ఉన్నపుడే ధన్‌రాజ్ కూడా మసాజ్ సెంటర్‌కు వెళ్లి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు.
ఆ తర్వాత ఆయనపై చాలా ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. ఈ చీకటి వ్యాపారంలో జబర్దస్త్ నటుల పేర్లు కనిపించడంతో ఇప్పుడు షో పేరు కూడా పాడైపోయే పరిస్థితి వచ్చింది. అందులోనూ హైపర్ ఆదికి పెద్దదెబ్బ తగిలేలా కనిపిస్తుంది ఇప్పుడు. దొరబాబు, పరదేశీలను జబర్దస్త్ కామెడీ షోలోకి తీసుకొచ్చింది ఆయనే. అంతకుముందు యూ ట్యూబ్‌లో బి గ్రేడ్ షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే దొరబాబుకు లైఫ్ ఇచ్చాడు ఆది. అయితే షోలో మాత్రం ఎప్పుడూ ఆయన గతంపై పంచులు పేలుస్తూనే ఉంటాడు హైపర్ ఆది.

దొరబాబు ఆ ప్రొఫెషన్ మానేసినా కూడా ఇంకా ఆది ఎందుకు అలా కుళ్లు జోకులు వేస్తున్నాడంటూ విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ అదే నిజమయ్యేసరికి ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు. ఈ వారం జబర్దస్త్ షోలో దొరబాబు ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఆయనతో పాటు పరదేశీ కూడా జబర్దస్త్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడో ఉన్న వాళ్లను తీసుకొచ్చి తన టీంలో పెట్టుకున్న హైపర్ ఆదికి ఇప్పుడు వీళ్లిద్దరూ చేసిన పనితో సమాధానం చెప్పుకోవడంతో పాటు తల పట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. మరి దీనిపై హైపర్ ఆది ఎలాంటి వివరణ ఇచ్చుకుంటాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *