హ్యాపీ సండే అంటున్న ఇసారెబ్బ..

తెలుగు బ్యూటీలు హాటీలు కారు అందుకే హీరోయిన్ పాత్రలకు ముంబై నుంచి వచ్చిన పాపలను ఎంచుకుంటూ ఉంటారని ఒక టాక్ ఉంది. అదే నిజమే అయితే తెలుగు హీరోలందరూ హృతిక్ రోషన్లు.. గ్రీకు గాడ్లు కావాలిగా? అలా ఏం లేరు కదా. జస్ట్ హీరోయిన్లకు మాత్రమే ఈ పిచ్చ లాజిక్కులు వర్తిస్తాయి ఇన్ని లాజిక్కులు ఉన్నప్పటికీ ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్ గా రావడం.. సినిమాలు చేయడం ఎంత కష్టం? అలా హీరోయిన్ గా సినిమాలు చేసిన అమ్మాయి ఈషా రెబ్బా.

సోషల్ మీడియాలో ఆ దిగుమతి భామలకు పోటీ అన్నట్టుగా హాటు ఫోటోషూట్లు చేస్తూ తెలుగు ఘాటును అందరికీ చూపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ ఒక ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసి “హ్యాపీ సండే” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజమే.. సండే హ్యాపీగా ఉండాలంటే ఇలాంటి అందాలను తప్పనిసరిగా చూడకతప్పదు. నలుపు రంగు శాటిన్ గౌన్ ధరించి సూపర్ సెక్సీ పోజులు ఇచ్చింది. ఆ డ్రెస్సు లో బేర్ బ్యాక్ హాట్నెస్ కు కేరాఫ్ అడ్రెస్సుగా ఉంది. ఆ ఎక్స్ ప్రెషన్ కూడా కిరాకుగా సన్యాసులకు చిరాకు పరాకులకు ఒకేసారి తెప్పించేదిగా ఉంది. ఏదేమైనా ఈషా తన బ్యాకు అందాలను ఇన్స్టా విస్తరాకుపై ఒడుపుగా వడ్డించింది. సండే స్పెషల్స్ లో ఈ ఫోటోలను కూడా భాగం చేసింది..

ఎప్పటి లాగే ఫోటోలకు నెటిజన్ల నుండి మంచి స్పందన దక్కింది. “లస్ట్ కోసం వెయిటింగ్ ఇక్కడ”.. “హ్యాపీ బ్యాక్ డే”.. “నీ వెనకే నేనుంటా” అంటూ రెచ్చిపోయారు. ఇక ఈషా ఫ్యూచర్ ప్రాజెక్టుల సంగతి మాట్లాడుకుంటే ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సీరీస్ తెలుగు వెర్షన్ లో నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *