20 ఏళ్ల అమ్మాయితో లేచిపోయిన దొంగ బాబా..ముచ్చటగా మూడో పెళ్లితో హీరోలా రీఎంట్రీ!

శివరాత్రి పండుగ రోజు మఠంలో పాదపూజ చెయ్యడానికి వెళ్లిన 20 ఏళ్ల యువతితో పరారైన ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులోని కోలారు సమీపంలోని హోళలి భీమలింగేశ్వర సేవాశ్రయం పీఠాధిపతి దత్తాత్రేయ అవధూత స్వామీజీ ఎట్టకేలకు కర్ణాటకలోని మంగళూరులో పోలీసులకు దొరికారు. అయితే పారిపోయేటపుడు స్వామీజీ గెటప్ లో ఉండగా పోలీసులకి దొరికే సమయానికి బాలీవుడ్ హీరో రేంజ్ లో స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు. బాబా గెటప్ చూసి పోలీసులు స్థానికులు షాక్ కు గురైయ్యారు. ప్రస్తుతం ఆ దొంగ స్వామీజీ అసలు రూపం ఏంటో చెప్పించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు.

పాద పూజ చేయడానికి మఠానికి వెళ్లిన అమ్మాయితో జంప్ అయిన దొంగబాబా …ఆ తర్వాత నేరుగా తిరుమలకి చేరుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత అయన ఆశ్రమంలోనే పనిచేస్తున్న యువతి సోదరుడికి ఆయన స్నేహితులకు ఫోన్ చేసిన స్వామీజీ యువతితో తాను తిరుమలలో పెళ్లి చేసుకున్నామని త్వరలో తిరిగి మఠానికి వస్తామని సమాచారం ఇచ్చాడు. బాబా పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న మఠం భక్తులు స్థానికులు షాక్ కు గురైనారు. దీనితో దొంగబాబా ఆచూకీ. మాయం అయిన అమ్మాయి ఆచూకి తెలుసుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరికోసం పలు బృందాలుగా విడిపోయి తీవ్రంగా గాలించారు.

మొదట తిరుపతిలో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేలోపే అక్కడి నుండి మాయమైపోయాడు. తరువాత విజయపురలో స్వామిజీ యువతి ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేముందే మళ్లీ కనిపించకుండా ఇద్దరు మాయమైపోయారు. అలా పోలిసుల కళ్లు కప్పి కొన్ని రోజులు ఆ ఊరు ఈ ఊరు అంటూ తిరిగినా చివరికి మంగళూరు సమీపంలోని మరడేశ్వరలోని గెస్ట్ హౌస్ లో పోలీసులు చిక్కిపోయారు. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న దత్తాత్రేయ అవధూత స్వామీజీ తన గెటప్ పూర్తిగా మార్చేశారు. నీట్ గా గడ్డం వెంట్రుకలు కట్ చేసిన స్వామీజీ బాలీవుడ్ హీరోలాగా కొత్త గెటప్ లో దర్శనం ఇవ్వడంతో పోలీసులతో పాటు మఠం భక్తులు కూడా షాక్ అయ్యారు.

ఇకపోతే ఇన్ని రోజులపాటు స్వామీజీ అంటు మోసం చేసిన ఈ దొంగబాబు పేరు రాఘవేంద్ర. అయితే తనపేరుని దత్తాత్రేయ అవధూత స్వామీజీగా మార్చుకొని కోలారులో ని హోగళి గ్రామంలో సెట్ అయ్యారు. ఈయనకి ఇది వరకే ఇద్దరితో పెళ్లి అయ్యింది అని ఇది ముచ్చటగా మూడో పెళ్లి అని రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అనేక మందిని మోసం చేశారని ఆయన మీద అనేక చీటింగ్ కేసులు నమోదు అయ్యాయని అన్ని కేసులు విచారణలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దొంగబాబా పెళ్లికూతురు ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *