వీ అన్న కలసివస్తుందా !!

హీరోయిన్ గా అదితి రావు హైదరి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. బాలీవుడ్ లో ఈమె గత 12 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడికి స్టార్ ఇమేజ్ మాత్రం దక్కట్లేదు. నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు అందాల ప్రదర్శణ విషయం లో ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఈ అమ్మడు స్కిన్ షో చేస్తుంది. అయినా కూడా ఈమెను పట్టించుకునే వారు లేరు. సౌత్ లో కూడా ఈ అమ్మడు వరుసగా చిత్రాలు చేస్తోంది. ముఖ్యంగా తెలుగు మరియు మలయాళం లో ఈ అమ్మడు సినిమాలు చేసింది.

తెలుగులో సమ్మోహనం చిత్రం తో పరిచయం అయ్యి మంచి పేరు దక్కించుకుంది. ఆ తర్వాత అంతరిక్షం చిత్రంలో నటించింది. ఆ రెండు సినిమాలు కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నా కూడా ఈమెకు మాత్రం అంతగా ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం ఈమె నాని విలన్ గా నటిస్తున్న ‘వి’ చిత్రంలో నటిస్తుంది. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుక గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అదితి రావు హైదరి తెలుగులో ‘వి’ చిత్రం తర్వాత బిజీ అవ్వడం ఖాయం అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు. కనుక అదితి రావు ఈ చిత్రంతో తెలుగులో మరిన్ని ఆఫర్లు దక్కించుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఒక వైపు వి చిత్రంలో నటిస్తూ మరో వైపు హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది అయినా ఈ అమ్మడికి క్రేజ్ దక్కించుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *