3 రాజధానులకు మద్దతుగా అనంత లో ర్యాలీ..మరియు మానవహారం

 

13 జిల్లాల రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీగా వెళ్లి మహావహారం నిర్వహించారు. కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్అధ్యక్షులు నదీమ్అహ్మద్ మరియు అనంతపురం అర్బన్ శాసనసభ్యులు అనంత వెంకటరామి రెడ్డి గారు హాజరవ్వడం జరిగింది.

ఈ సందర్బంగా పార్టీ అనంతపురం_పార్లమెంట్_అధ్యక్షులు నదీమ్_అహ్మద్ మాట్లాడుతూ అభివృద్ధి వీకేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని అందులో బాగానే సీఎం గారు కృషి చేస్తూ అభివృద్ధి లో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తుంటే అది చూసి ఓర్వ లేక ప్రజలను పక్క దారి పట్టించే విదంగా టీడీపీ, జనసేన, వామపక్షాలు ప్రభుత్వం మీద బురద చల్లడం సిగ్గు చేటు అనీ,అమరావతి భూకుంభకోణం దేశంలో ఎక్కడ లేని విధంగా ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులతో బలవంతంగా లాక్కున్నారు అనీ, అమరావతి ఉద్యమం కేవలం భూములు కొన్న రియల్ ఎస్టేట్ వారు మాత్రమే చేస్తున్నారు అని తెలిపారు.

అలాగే మూడు రాజధానులకు మద్దతుగా నిలుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి పథంలో నడుపుతున్న ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అలానే ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురామ్, సంయుక్త కార్యదర్శి శివా రెడ్డి, మాజీ మునిసిపల్ చైర్మన్ నూర్ మొహమ్మద్ , కోగటం విజయభాస్కర్ రెడ్డి, విద్యార్ధి మరియు యువజన విభాగ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *