4 లక్షలు కొరకు కక్కుర్తి.. ఇన్ఫోసిస్ ఉద్యోగులు కటకటాలు పాలు

ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు….అదే విధంగా అన్నం పెడుతున్న కంపెనీకే వెన్నుపోడిచే ఉద్యోగులను కూడా పట్టుకోవడం కొంచెం కష్టమే….కానీ అసాధ్యం కాదు. కాసులకు కక్కుర్తిపడి తాము పనిచేస్తోన్న సంస్థను మోసం చేయాలనుకున్న ఐటీ ఉద్యోగులు చివరకు కటకటాలపాలయ్యారు. కొసరుగా వచ్చే డబ్బు కోసం అత్యాశకు పోయి….అసలుకే ఎసరు తెచ్చుకున్నారు. తమ సంస్థలో గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటోన్న ముగ్గురు ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. నాలుగు లక్షల కోసం కక్కుర్తి పడి….కటకటకాలపాలయ్యారు.

బెంగుళూరు ఇన్ఫోసిస్ కార్యాలయంతో ఆదాయపు పన్ను శాఖకు ఒప్పందం ఉంది. దీంతో ఆదాయపు పన్నుకు సంబంధించిన విభాగంలో పని చేసే ఉద్యోగులకు ఆదాయపన్ను చెల్లింపుదారుల సమాచారం ముందుగానే తెలుస్తుంది. కానీ ఒప్పందం ప్రకారం ఈ సమాచారం అత్యంత గోప్యంగా ఉంచాలి. అయితే కాసులకు కక్కుర్తి పడ్డ ముగ్గురు ఐటీ ఉద్యోగులు…ఈ సమాచారాన్ని సొమ్ము చేసుకుంటున్నారట. రేణుగుంట కళ్యాణ్ కుమార్ ప్రకాష్ దేవేశ్వర్ రెడ్డిలు తమకు అందిన సమాచారాన్ని టాక్స్ అసెస్ మెంట్ కోసం తదుపరి ప్రాసెసింగ్ కోసం ఆదాయంపన్ను శాఖకు తెలియజేస్తుంటారు. అదే సమయంలో సదరు పన్ను చెల్లింపుదారులతో టచ్ లో ఉంటారు. ట్యాక్స్ పై రిబేట్ లు ఇస్తామంటూ పన్ను చెల్లింపుదారుల నుంచి నగదు నొక్కేయడం వీరికి అలవాటు. నెల రోజుల్లో సుమారు నాలుగు లక్షలను ఇలా ‘నొక్కేశారని’ విచారణలో తేలింది. 4 శాతం టాక్స్ రిబేట్స్ లభించేలా చూస్తామని ఆశ పెడుతూ డబ్బు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. ఆదాయపు పన్ను శాఖ ఇచ్సిన ఫిర్యాదుతో ఆ ముగ్గురు టెకీలపై చీటింగ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బెంగుళూరు కోర్టు వీరికి 14 రోజుల జుడిషియల్ కస్టడీ రిమాండ్ విధించింది. ఆ నాలుగు లక్షల సొమ్మును పోలీసులు రికవర్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *