నగ్నంగా వీడియో తిసి..లైంగిక దాడులు చేసిన ఓ డాక్టర్

thesakshi.com    :   ఛత్తీస్‌గఢ్,  రాయ్‌పూర్‌లో జరిగిన దారుణం. 28 ఏళ్ల ఆయుర్వేద ప్రాక్టీషనర్… పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

దాని ఆధారంగా… పోలీసులు డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ హాస్పిటల్‌‌లో కొవిడ్ 19 వార్డులో సేవలు అందిస్తున్న ఓ MBBS డాక్టర్‌ను అరెస్టు చేశారు.

పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తనను రేప్ చేశాడని బాధితురాలు ఆరోపించింది. ప్రస్తుతం ఆ డాక్టర్… మెడికల్ స్టడీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. అతనిపై DD నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

డాక్టర్ లైంగిక వేధింపులు, రేప్, బ్లాక్‌మెయిల్‌కి పాల్పడినట్లు బాధితురాలు తన కంప్లైంట్‌లో తెలిపింది. ఐతే… కొన్నేళ్లుగా ఆ డాక్టర్ తనను పెళ్లి పేరుతో ఇలాగే మోసం చేస్తూ వచ్చాడని బాధితురాలు ఆరోపించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దాదాపు ఇలాంటిదే మరో ఘటన కూడా జరిగింది. ఈ కేసులో… ఓ మహిళా హోమియోపతి డాక్టర్… ఓ వ్యక్తిపై కేసు పెట్టింది. తనను రేప్ చేయడమే కాక… నగ్నంగా వీడియో తిసి… లైంగిక దాడులు చేశాడని అతనిపై కంప్లైంట్ ఇచ్చింది. ఆమె చెప్పిన దాని ప్రకారం… అతడు… నగ్న వీడియోని చూపించి… ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు.

“నీ భర్త నుంచి విడాకులు తీసుకో. అదనపు కట్నం కావాలని నిన్ను వేధిస్తున్నాడని అతనిపై కేసు పెట్టు” అని బెదిరించాడు.

నానాటికీ అతని వేధింపులు ఎక్కువవుతుండటంతో… భరించలేకపోయిన ఆమె… మొత్తం విషయాన్ని పోలీసుల ముందు చెప్పింది. దాంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి… లోపలేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *