‘AA20’ అన్నీ కలిసొచ్చాయి

శేషాచలం బ్యాక్ డ్రాప్ లో ఓ కథ అనుకొని మహేష్ కి పాయింట్ చెప్పాడు సుకుమార్. పూర్తి కథ సిద్దం అవ్వకుండానే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రకటన వచ్చేసింది. మహేష్ తో ‘1 నేనొక్కడినే ‘ డిఫరెంట్ రివెంజ్ మూవీ తీసిన సుకుమార్ మళ్ళీ సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేస్తుండటం ఫ్యాన్స్ అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. కాంబో అనౌన్స్ అవ్వగానే సినిమాపై హైప్ వచ్చేసింది. తీరా చూస్తే కొన్ని రోజులకి ప్రాజెక్ట్ క్యాన్సల్ అయింది.

లోలోపలే కొన్ని రోజుల డిస్కర్షన్ జరిగాయి. సరిగ్గా ఓ నెలలో సెట్స్ పైకి వెళ్తుందనాగా క్రియేటీవ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా నుండి తప్పుకుంటున్నాని చెప్తూ ట్వీట్ వేసి బయటికొచ్చేశాడు మహేష్. వెంటనే బన్నీ తో సినిమా అనౌన్స్ చేసాడు సుకుమార్. అయితే సుకుమార్ మొండిపట్టుదల గురించి కొందరు మాట్లాడుకుంటే మహేష్ అలా చేసి ఉండకూడదని మరికొందరు మాట్లాడుకున్నారు. ఇక ఎట్టకేలకు కథ బన్నీ కి రాసి ఉండటం AA 20 గా సినిమా అనౌన్స్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *