‘AA20’ … టైం పట్టేలా ఉందే

సుకుమార్ -బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇప్పటికే సగం షూటింగ్ జరుపుకోవలసింది. ఆది నుండి సినిమాకు తగులుతున్న అడ్డంకుల తో ఎప్పటికప్పుడు షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఎట్టకేలకు కేరళలో బన్నీ మిగతా నటీ నటుల తో ఓ భారీ షెడ్యుల్ ప్లాన్ చేసుకున్నారు. ఇంతలో కరోనా ఎఫెక్ట్ షూటింగ్ కి తగిలింది. కేరళ ప్రభుత్వం షూటింగ్ కి ఇచ్చిన అనుమతి వెనక్కి తీసుకుంది.

దీంతో వెంటనే ప్లాన్ మార్చేసుకున్నారు మేకర్స్. కేరళ నుండి షూట్ ను ఆంధ్రప్రదేశ్ కి షిఫ్ట్ చేసుకున్నారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షెడ్యుల్ ప్లాన్ చేసారు. కానీ ప్రస్తుతం తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉండటం తో పరిస్థితి ఎప్పుడు చక్కబడుతుందా అని ఎదురుచూస్తున్నారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ రెండో వారమో లేదా మూడో వారం నుండో షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఇటివలే బన్నీ మీద లుక్ టెస్ట్ కూడా చేసారు. గుబురు గడ్డం లాంగ్ హెయిర్ తో మాసీ లుక్ లాక్ చేసారు. ఈ గెటప్ లోనే అల్లు అర్జున్ సినిమా లో నటించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. ఈ ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *