హారిక కెప్టెన్ అవ్వడం జీర్ణించుకోలేక పోయిన అఖిల్

thesakshi.com    :   బిగ్ బాస్ ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో అఖిల్ టాప్ 5 లో ఉంటాడనే నమ్మకం చాలా మందిలో ఉంది. కాని ఆయన ఈమద్య కాలంలో బాగా వ్యతిరేకత కూడగట్టుకుంటూ ఉన్నాడు. అతడు సీక్రెట్ రూంకు వెళ్లిన తర్వాత మొత్తం అతడి గురించి జనాల్లో తప్పుగా వెళ్తుంది. అతడు బయటకు వచ్చిన తర్వాత వ్యవహరించిన తీరు విమర్శల పాలయ్యింది. మేకలా వెళ్లిన నేను పులిలా వచ్చాను అంటూ చేసిన వ్యాఖ్యలు చాలా మందిక నవ్వు తెప్పించాయి. ఇక తాజా ఎపిసోడ్ లో అఖిల్ వ్యవహరించిన తీరు మరింతగా అతడిపై వ్యతిరేకత కలిగేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కమాండో టాస్క్ లో భాగంగా ఉత్తమ ప్రదర్శణ కనబర్చిన అఖిల్ అభిజిత్ మరియు హారికలు కెప్టెన్సి టాస్క్ లో పోటీ పడ్డారు. ఆ టాస్క్ లో భాగంగా కెప్టెన్సీ దారులను వారి మద్దతు దారులు ఎత్తుకుని ఉండాలి. ఎవరు ముందు కాలు కింద పెడితే వారు కెప్టెన్సీ పోటీ నుండి తప్పుకోవడం జరుగుతుంది. ముందుగానే అభిజిత్ ను అవినాష్ ఎత్తుకునేందుకు ముందుకు వచ్చాడు. అఖిల్ ను అంతా అనుకున్నట్లుగానే సోహెల్ బుజాలపై వేసుకుని మోసేందుకు ముందుకు వచ్చాడు. హారికను మోనాల్ మోసేందుకు ముందుకు వచ్చింది. టాస్క్ బజర్ మోగే సమయంకు రెడీ అయ్యారు.

బజర్ మోగిన వెంటనే ముగ్గురు వారి మద్దతుదారుల మీదకు ఎక్కారు. మొదట అభిజిత్ ను మోయలేక అవినాష్ కిందకు దించాడు. ఆ తర్వాత సోహెల్ చాలా ప్రయత్నించాడు. కాని అఖిల్ ను మోయడం కష్టం అయ్యింది. దాంతో రెండవ కంటెస్టెంట్ అఖిల్ కూడా కిందకు దిగడంతో హారిక విజయం సాధించింది. మోనాల్ సాయంతో హారిక బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయ్యింది. ఆ ఆనందంలో ఆమె చేసిన హడావుడి మామూలుగా లేదు.

కెప్టెన్సీ మోనాల్ వల్ల కోల్పోవడంతో అఖిల్ తట్టుకోలేక పోయాడు. సహనం కోల్పోయి గట్టిగా అరుస్తూ మంచంపై పిడిగుద్దులు గుద్దాడు. ఆ సమయంలో మోనాల్ వచ్చినా ఆమెను అక్కడి నుండి వెళ్లి పోవాల్సిందిగా కోరాడు. హారిక కెప్టెన్ అవ్వడం అఖిల్ కు ఏమాత్రం ఇష్టం లేకుండా కనిపించింది. ఓటమిని అంగీకరించని అఖిల్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కష్టపడి మోనాల్ హారికను కెప్టెన్ గా చేయడం అఖిల్ కు అస్సలు నచ్చలేదు. దాంతోనే అసహనంతో కాస్త సైక్ అయ్యాడు. నేటి ఎపిసోడ్ లో ఆ విషయమై నాగార్జున ఏమైనా మాట్లాడేనా చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *