అలుపెరగని భగీరథుడొకరు..కొండనుచీల్చిన ధీశాలొకరు..

thesakshi.com   :   గమ్యం స్థిరంగా ఉండాలి. మార్గం కచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నంలో రాజీ ఉండకూడదు అప్పుడే విజయం లభిస్తుంది. విజయానికి ఏ బలహీనత అడ్డు కాదన్నట్లు పోరాడు ఎంతటి కఠినమైనా , క్లిష్టమైనా గమ్యాన్ని చేరుకోవచ్చు అని నిరూపించారు . ఓనిరుపేద 30 ఏళ్లు గా అలుపెరగని కృషి చేసి 3 కిలోమీటర్ల కాలువ తవ్వి పాలకులకు కళ్ళు తెరిపించారు లంగీభుయాన్. బీహార్ రాష్ట్రంలోని గయావాసి అయన.

గతంలో బీహార్ లో గెహ్లోర్ గ్రామానికి రోడ్ నిర్మించి చరిత్ర సృష్టించారు. 22 ఏళ్ల పాటు శ్ర‌మించి ఓ సామాన్య భూమిలేని నిరుపేద కూలి 360 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడ‌ల్పుతో కొండ‌ను నిట్ట నిలువుగా చీల్చాడు ద‌శ‌ర‌థ్ మాంజీ. ఇప్పుడు వ‌జీర్ గంజ్‌లో ఉన్న హాస్పిట‌ల్స్‌కు, స్కూల్స్ కు చేరాలంటే కేవ‌లం ఐదు కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తే స‌రిపోతుంది. ఆ చుట్టుప‌క్క‌ల‌ ఉన్న 60 గ్రామాల ప్ర‌జలు ఆ మార్గాన్ని ఉప‌యోగించుకుంటున్నారు.

నాడు రహదారి నిర్మిస్తే నేడు పంట పొలాలకు నీటి తరలించడానికి కాలువ తొవ్వాడు. తన గ్రామంలో ఉన్న పంట పొలాలు బీడు భూమి కాకుండా పచ్చని పంటలతో కళకళలాడుతూ అందరూ అనందంగా జీవనం సాగించాలని తలచాడు. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం సాగించాడు విజయం సాధించాడు.

బీహార్‌లోని గయాకు చెందిన
లంగీ భుయాన్‌ అనే వ్యక్తి 30 ఏళ్లు కష్టపడి. కాలువను తవ్వాడు. తన గ్రామంలోని పంట పొలాలకు నీటిని మళ్లించటం కోసం 3 కిలోమీటర్ల కాలువ తవ్వాడు. ఈ కాలువ నుంచి నీటిని గ్రామంలోని కుంటలోకి వెళ్లేలా ఏర్పాటు చేశాడు. కుంట నుంచి నీరు పంటపొలాలకు చేరుతోంది.

గ్రామస్థులందరూ బతుకుదెరువు కోసం నిత్యం సమీప పట్టణాలకు వలస వెళ్తుంటే ఊరినే నమ్ముకొని జీవిస్తున్న భుయాన్‌
వర్షాకాలంలో తన ఊరి చుట్టూ ఉన్న కొండల మీద పడిన వర్షం వృథాగా నదుల్లో కలవడం చూసి కాలువ తవ్వడానికి నిర్ణయించుకున్నాడు.

తనకున్న పశువులను నిత్యం మేతకు తీసుకెళ్లే భుయాన్‌ అవి మేసే సమయంలో కాలువను తవ్వడం ప్రారంభించారు. ఓక్కడే అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించారు .

ఇతడి వల్ల వందలాది పశువులకు తాగునీరు, పొలాలకు సాగునీరు అందేలా చేశారు. తను కన్న కలలన్నీ సహకారం చేసుకున్నారు ఈయన పట్టుదలను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటివారిని గుర్తించి ప్రభుత్వం సత్కరించాల్సిన అవసరం ఉంది.

సేకరణ:–✒️చందమూరి నరసింహారెడ్డి
9440683219

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *