జనసేన పయనం: తోలు తీయడం నుంచి తలలు నరికే వరకూ!

ఒకవైపు  నోరు తెరిస్తే వపన్ కల్యాణ్ నుంచి మాటల కన్నా సూక్తులే ఎక్కువగా వస్తాయి. తను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించను అంటూ మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా పవన్ చెప్పుకుంటాడు. అయితే తన రాజకీయ ప్రత్యర్థుల కులం గురించి మాట్లాడటమే పవన్ కు తెలిసిన రాజకీయం! ఆల్రెడీ జనాలకు అన్నీ తెలిసినా.. పవన్ కల్యాణ్ ఏదో రకంగా కెళికి తృప్తి పొందుతూ ఉంటాడు!

ఇక పవన్ కల్యాణ్ ఇచ్చే వార్నింగులు కూడా ఏ మాత్రం ప్రజాస్వామ్యికంగా ఉండవు. ప్రజారాజ్యం పార్టీ నాటి నుంచి ఇదే కథే సాగుతూ ఉంది. అప్పట్లో పవన్ కల్యాణ్.. కాంగ్రెస్ నేతల పంచెలూడగొట్టాలంటూ ఏదో మాట్లాడే వాడు. ఆ తర్వాత కూడా పవన్ తీరు అలాగే సాగుతూ ఉంది.

జనసేన వచ్చాకా పవన్ కల్యాణ్ ‘తోలు తీస్తా.. తాట తీస్తా..’ అంటూ ఏదో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ఈ మాటలు జనాలకు ఏ మాత్రం రుచించలేదు. అందుకే పవన్ కల్యాణ్ కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయాడు.

ఈ నేపథ్యంలో ఫ్రస్ట్రేషన్ పవన్ కల్యాణ్ లో కొనసాగుతున్నట్టుగా ఉంది. ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాడు జనసేన అధిపతి. ఇలాంటి క్రమంలో.. ఆయన పోకడ అలా సాగుతూ ఉంది.

ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.. అనే సామెత ఒకటి ఉంది. ఆ మేరకు పవన్ కల్యాణ్ పార్టీ వాళ్లు మరో అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు. పవన్ కల్యాణ్ ‘తాట తీస్తా..’ అని అంటుంటే.. జనసేన నేతలు ఏకంగా ‘తలలు నరుకుతాం..’ అని అంటున్నారు.

పవన్ కల్యాణ్ మదనపల్లి సభలో రాప్తాడు నియోజకవర్గం నేత ఒకరు తమ నియోజకవర్గం ఎమ్మెల్యే తలనరుకుతాం అని ప్రకటించారు. ‘ప్రకాష్ రెడ్డి తలే కాదు.. జిల్లాలోని ఏ రెడ్డి తలను అయినా నరుకుతాం..’ అంటూ ఆయన హెచ్చరించారు. పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇస్తే అదే జరుగుతుందని ఈ విషయంలో తన మీద కేసులు కూడా పెట్టుకోవచ్చని ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించారు.

అలా తన పార్టీ నేత ఒకరు తన సమక్షంలో హింసాత్మకంగా తలలు నరుకుతామంటూ మాట్లాడుతూ ఉంటే.. పవన్ కల్యాణ్ కనీసం వారించలేదు. పైపెచ్చూ ఆయన అలా మాట్లాడుతూ ఉంటే ఈయన వెకిలి నవ్వులు నవ్వుతూ కనిపించారు. ఇందుమూలుంగా హింసను రెచ్చగొట్టడం ఒక కులాన్ని రెచ్చగొట్టడమే జనసేన అజెండా అని స్పష్టం అవుతూ ఉంది. పవన్ కల్యాణ్   ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఒక విచ్ఛినకారి రాజకీయ నేతగా మారుతున్నట్టుగా ఉన్నారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *