ఏపీలో మరో 9276 కరోనా కేసులు నమోదు

thesakshi.com    :    ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు రోజులుగా రోజుకు కనీసం 10వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

అయితే, గత 24 గంటల్లో కొంచెం తగ్గాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 9276 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది.

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,50,209కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 57 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో కలిపి మొత్తం కరోనా మరణాల సంఖ్య 1407కి చేరింది.

తూర్పుగోదావరి జిల్లాలో 8, విశాఖ జిల్లాలో 8, గుంటూరు 7, అనంతపురం 6, చిత్తూరు 6, కర్నూలు 6, శ్రీకాకుళం 4, కృష్ణ 3, పశ్చిమ గోదావరి 3, నెల్లూరు 2, ప్రకాశం 2, విజయనగరం 2, కడపలో ఒకరు కరోనాతో చనిపోయారు.

ఏపీలో గత 24 గంటల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1234 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 1155, అనంతపూర్ 1128, గుంటూరు 1001 కరోనా కేసులు నమోదయ్యాయి.

చిత్తూరు 949, తూర్పుగోదావరి 876, నెల్లూరు 559, కడప 547, పశ్చిమగోదావరి 494, శ్రీకాకుళం 455, ప్రకాశం 402, కృష్ణా 357, విజయనగరం 119 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది.

గత 24 గంటల్లో ఏపీలో 60,797 కరోనా టెస్టులు చేశారు. మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 20,12,573. రాష్ట్రంలో ప్రస్తుతం72,188 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 76,716 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1407 మంది చనిపోయారు.

తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల్లో ఏపీ మూడో స్థానానికి చేరింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 422118 కరోనా కేసులు ఉండగా, ఆ తర్వాత తమిళనాడులో 2,45,859 కరోనా కేసులు ఉన్నాయి.

ఆ తర్వాత ఏపీలో 150209 కరోనా కేసులు ఉన్నాయి. కరోనా టెస్టుల్లో కూడా ఏపీ మూడోస్థానంలో ఉంది. తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత ఏపీలో అత్యదిక కరోనా టెస్టులు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *