జగన్ గ్రేట్.. అభినందించిన బీజేపీ ఎంపీ

హిందుత్వవాదానికి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడన్న కారణంగా గత చంద్రబాబు ప్రభుత్వం టీటీడీ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులను ఆ పోస్టు నుంచి సాగనంపిన సంగతి తెలిసిందే.. ఈ ఘటన దుమారం రేపింది. దీనిపై బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం కోర్టుకు ఎక్కి చంద్రబాబు నిర్ణయంపై రమణదీక్షితులకు మద్దతుగా న్యాయపరంగా పోరాడారు.

అయితే తాజాగా సీఎం జగన్ ప్రభుత్వం.. రమణ దీక్షితులను తిరిగి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టీటీడీ నియమించింది.

ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారిని ఈ ఉదయం కేంద్రమంత్రి గుర్జర్ – ఎంపీ శ్రీనివాసరెడ్డితో కలిసి బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సందర్శించారు. రమణ దీక్షితుల నియామకంపై ఆయన స్పందించారు.

టీటీడీలో వంశపారంపర్య అర్చకుల పట్ల జగన్ తీరు అభినందీయమని సుబ్రహ్మణ్య స్వామి ప్రశంసించారు. టీటీడీలో ఆడిటింగ్ స్వయంగా నిర్వహించాలని.. టీటీడీ నిధులను ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని సూచించారు.  గతంలో దేశ స్థానంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు జరగాలని స్వామి సీఎం జగన్ ను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *