అందానికి అందం ప్రతిభతో రాణించిన బాలీవుడ్ స్టార్

thesakshi.com    :    గ్లామర్ పరిశ్రమలో బెట్టు చేస్తే కష్టమే. దాచేస్తే ప్రయోజనం శూన్యం. ఎక్కడ తగ్గాలి.. ఎక్కడ ఎలా ఓపెనవ్వాలి! అనేది ముఖ్యం. ఈ విషయంలో నాలుగు కాదు పది ఆకులు ఎక్కువే తింది సీనియర్ నటి విద్యా బాలన్.

దశాబ్ధాల కెరీర్ బండిని తెలివిగా లాగించేయడం అంటే ఆషామాషీనా?

ఓవైపు వైఫ్ గా భర్తకు సేవలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో టాప్ రేంజ్ కథానాయికగా చక్రం తిప్పుతోంది ఈ సీనియర్ భామ.

ఇంతకుముందు ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తనదైన నటనతో నందమూరి అభిమానులు సహా తెలుగు ప్రేక్షకుల మనస్సుపై ఘాడమైన ముద్రనే వేశారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా బాలన్ పేరు మార్మోగింది.

అందానికి అందం ప్రతిభతో రాణించిన బాలీవుడ్ స్టార్ గా బాలన్ కి చెరగని పేరుంది. డర్టీపిక్చర్ లో సిల్క్ స్మితగా నటించినా.. మిషన్ మంగళ్ లాంటి ఛాలెంజింగ్ మూవీలో మహిళా సైంటిస్టుగా నటించినా.. ఇప్పుడు శకుంతలాదేవి (గణితశాస్త్ర మేధావి) గా నటించినా బాలన్ లోని విలక్షణతకు దర్పణం ఇవన్నీ. తన ఎంపికలు సపరేట్.

బాలన్ ఫోటోషూట్ల వైవిధ్యం అంతే మైమరిపిస్తుంది. మెడలో ఆభరణం లేదు.. నుదిటిన కుంకుమ బొట్టు లేదు.. చేతికి గాజుల్లేవ్.. వాచీ పెట్టనూ లేదు..! కానీ ఇంకేదో ఏదో హాట్ అప్పీల్ తనలో ఉంది!! అందుకేగా బాలన్ మ్యాడమ్ అంత ప్రత్యేకం.

బులుగు కోటు మీద ఫ్లోరల్ టాప్ తో అదరగొట్టారు మ్యాడమ్. ఒంపుసొంపుల్ని ఎప్పుడు ఎలా ఆవిష్కరించాలి? అన్నది తనకి తెలిసినట్టుగా వేరే ఎవరికీ తెలీదేమో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *