ఇండియాలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

thesakshi.com    :   ఇండియాలో కరోనావైరస్ పంజా విసురుతూనే ఉంది. క్రమంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 46,232 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 564 మరణాలతో, భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 90,50,598 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఇండియాలో మరణించిన వారి సంఖ్య 132,726 కు పెరిగింది . ఇక కోవిడ్ -19 యొక్క క్రియాశీల కేసుల సంఖ్య 439,747 గా ఉంది.

ఉదయం 8 గంటలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పిన లెక్కల ప్రకారం , కరోనా నుండి ఇప్పటివరకు 8,478,124 మంది కోలుకోగా, గత 24 గంటల్లో 49,715 మంది రికవర్ అయ్యారు. జాతీయ రికవరీ రేటు శనివారం 93.67 శాతానికి మెరుగుపడిందని తెలుస్తుంది . కరోనావైరస్ కోలుకున్న మరియు యాక్టివ్ గా ఉన్న కేసుల మధ్య అంతరం 8,038,377 కు పెరిగింది. 28 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 20,000 కంటే తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అత్యధికంగా కరోనా కారణంగా దెబ్బతిన్న రాష్ట్రమైన మహారాష్ట్రలోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 5,640 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరుణ కేసుల సంఖ్య 17, 68,695 కి చేరింది. ప్రస్తుత మహారాష్ట్ర లో యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 78 , 272 గా ఉంది . కరోనా మహమ్మారి కారణంగా మహారాష్ట్ర ఇప్పటివరకు 46, 511 మంది మృతి చెందారు.

కరోనావైరస్ నిరోధించటానికి వ్యాక్సిన్ల తయారీ , సేకరణ మరియు పంపిణీ వ్యూహాన్ని ప్రధానమంత్రి మోడీ శుక్రవారం సమీక్షించారు. భారతదేశం యొక్క కరోనా వ్యాక్సిన్ తయారీలో పురోగతి, నియంత్రణ ఆమోదాలు మరియు సేకరణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు చర్చించబడ్డాయి అని మోడీ సమావేశం తరువాత ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ వచ్చాక ప్రాధాన్యతా క్రమంపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది . దేశంలోని మరియు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్ కు సంబంధించిన పరిశోధనల పురోగతి గురించి చర్చించి భవిష్యత్ ప్రణాళిక ఏంటి అన్నదానిపై చర్చించినట్టు సమాచారం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *