బుల్లి అర్హకు డాడీ ఇచ్చిన బుజ్జి కానుకను చూశారా?

బుల్లి అర్హకు డాడీ ఇచ్చిన బుజ్జి కానుకను చూశారా? నేడు అర్హ బర్త్ డే .. అందుకే అల్లు అర్జున్ ఇలా స్పెషల్ గిఫ్ట్ ని ప్లాన్ చేశారు. ఇంతకీ ఆ బుల్లి పెట్టెలో అర్హ కోసం ఎలాంటి గిఫ్ట్ దాగి ఉందో?

తన వారసురాలు అర్హ అంటే బన్నికి ఎంత ప్రేమో తెలిసిందే. అర్హకు సంబంధించిన ప్రతి ఎగ్జయిటింగ్ మూవ్ మెంట్ ని అభిమానులకు షేర్ చేస్తుంటారు. ఇన్ స్టాలో తనకంటే బిగ్ సెలబ్రిటీగా అలరిస్తోంది అల్లు అర్హ. తాత డాడీలను ఈ అల్లరి గడుగ్గాయ్ తెగ ఏడిపించేస్తూ ఉంటుంది. అర్హ క్యూట్ అల్లరి వేషాల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాల్లో బన్ని షేర్ చేస్తూనే ఉన్నారు. అవి ఫ్యాన్స్ లో జెట్ స్పీడ్ తో వైరల్ అవుతూనే ఉన్నాయి.

అన్నట్టు నేడు బర్త్ డే సందర్భంగా అర్హకు ఓ స్పెషల్ గిఫ్ట్ అందనుంది. అదేమిటి? అంటే.. అంజలి సినిమా నుంచి అంజలి అంజలి పాటకు అర్హ అభినయం డ్యాన్సులు చేసిన స్పెషల్ వీడియో. “నా చిన్ని దేవదూత అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు. లిటిల్ ఏంజెల్ అనంతమైన క్యూట్ నెస్ జాయ్ ని నాకు కానుకిచ్చావు. వండర్ ఫుల్ బర్త్ డే గాళ్ కి ఇవే నా విషెస్“ అంటూ బన్ని ఎంతో ఆనందానికి ఉద్వేగానికి గురయ్యారు.

అల్లు అర్హా తన ప్రియమైన తండ్రి నుండి ప్రత్యేక బహుమతి పెట్టెను స్వీకరించి ఎంత జాయ్ ఫుల్ గా కనిపిస్తోందో చూశారు కదా! ఇలాంటి అరుదైన మూవ్ మెంట్ ఇంకెవరికీ ఉండదేమో! తుపాకి తరపున బుల్లి బుల్లి అర్హాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అర్హ డ్యాన్సింగ్ స్టైల్ వీక్షణ కోసమే ఫ్యాన్స్ వెయిటింగ్. ఆ స్పెషల్ సాంగ్ వీడియో మరి కాసేపట్లో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *