వనితా విజయ్ కుమార్ భర్తపై మొదటి భార్య కంప్లైంట్ ?

thesakshi.com   :   తమిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్ – మంజుల కుమార్తెల్లో వనితా విజయ్ కుమార్ ఒకరు. ఈమెకు ఇప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వీరు అనుమతి ఇవ్వడంతో వనితా విజయ్ కుమార్ ఇటీవల మూడో వివాహం చేసుకుంది. అతని పేరు పీటర్ పాల్. ప్రముఖ తమిళ ఫిల్మ్ మేకర్. అయితే, ఈయనకు ఇప్పటికే వివాహమైవుంది. ఇపుడు పీటర్ పాల్ మొదటి భార్య అడ్డం తిరిగింది.

ఆమె పేరు ఎలిజబెత్. ఈమె ఇపుడు చెన్నై, వడపళని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన నుంచి విడాకులు తీసుకోకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని, పీటర్ పాల్‌పై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరింది. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తాము గత ఏడేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నామని వెల్లడించింది.

కాగా, నటి వనిత విజయ్ కుమార్‌కు గతంలో ఆకాశ్, ఆనంద్ జే రాజన్‌లతో వివాహాలు జరిగాయి. కొంతకాలం రాబర్ట్ అనే వ్యక్తితోనూ డేటింగ్ చేసినట్టు కోలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

అంతేకాదు, తన తండ్రి విజయ్ కుమార్‌తో ఆస్తి వివాదాల్లోనూ ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. ఈమె నటించింది కొద్ది సినిమాలు అయినప్పటికీ… వివాదాస్పద అంశాల్లో ద్వారానే ఆమె అధికంగా గుర్తింపు పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *