ఏపీ రాజధాని, మిగతా ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై జీన్ రావు కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ముఖ్యాంశాలు

1) ఏపీ రాజధాని, మిగతా ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై సెప్టెంబరు 13న ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ ఈరోజు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలోని ముఖ్యాంశాలను జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు మీడియాకు వివరించారు.

– రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించాం. 10,600 కిలో మీటర్లు తిరిగాం. 38 వేల విజ్ఞాపనలు వచ్చాయి. 2 వేల మంది రైతులతో నేరుగా మాట్లాడాను. జిల్లాలకు వెళ్ళి.. అక్కడి ప్రజలు ఏం అభివృద్ధి కోరుకుంటారో అన్న దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేశాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మెరుగైన సూచనలు చేశాం. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే నివేదిక ఉంది.

– ఏపీలో ప్రాంతీయ అసమానతలు చాలా ఉన్నాయి.
– ప్రాంతాల మధ్య అభివృద్ధి- సమతూకంపై అధ్యయనం చేశాం..
– కొన్ని ప్రాంతాలు అభివృద్ధి పథంలో దూసుకువెళుతున్నాయి
-మరికొన్ని ప్రాంతాలు మరీ వెనుకబడి ఉన్నాయి.
-పట్టణీకరణ అంతా మధ్య, ఉత్తర కోస్తాలోనే ఉంది.
– ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. అలానే అడవులు, నదులు ఉన్నాయి.
– పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి- అభివృద్ధి వల్ల పర్యావరణం దెబ్బతినకూడదు. పర్యావరణాన్ని రక్షించుకుంటూనే అభివృద్ధి ఉండాలి.
పర్యావరణం- అభివృద్ధిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి- అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా ఉండాలి.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కొన్ని సూచనలు చేశాం..

2) అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళు ఏర్పాటు చేయాలి.

నార్త్ కోస్టల్- శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలు
సెంట్రల్ కోస్తా- ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా
సౌత్ కోస్తా- గుంటూరు, ప్రకాశం, నెల్లూరు,
రాయలసీమ – వైయస్ఆర్ కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం

3) శ్రీ బాగ్ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకునే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి
– అమరావతిలో ఒక బెంచ్.. విశాఖలో మరో బెంచ్ ఏర్పాటు చేయాలి

4) విశాఖపట్నం మెట్రో పాలిటిన్ రీజియన్లో సెక్రటేరియేట్, సీఎం క్యాంపు ఆఫీసు ఉండాలి.
– అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేస్తే బాగుంటుందని సూచనలు, సలహాలు చేశాం

5) తుళ్ళూరు, మంగళగిరి ప్రాంతంలో అసెంబ్లీ, కొన్ని ప్రభుత్వ శాఖలు ఉండాలి.

– గవర్నర్ క్వార్టర్స్, రాజభవన్ అమరావతిలోనే ఉండాలి
– వేసవిలో అసెంబ్లీ సమావేశాలు విశాఖలో నిర్వహించాలి.
– వరదలు వల్ల నష్టం లేకుండా.. మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయాలి
– మహారాష్ట్ర, శ్రీనగర్ లో ఉన్నట్టుగా..విశాఖ, అమరావతి నుంచి లెజిస్లేచర్ వ్యవస్థ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *