తన అంతిమ లక్ష్యం పదవి కాదు ప్రజల శ్రేయస్సు :పవన్ కళ్యాణ్

thesakshi.com    :    పవన్ కళ్యాణ్ .. రాజకీయాల్లోకి వచ్చే ముందు చెప్పిన మాట .. ప్రస్తుతం చెప్పే మాట కూడా ఒక్కటే.

తన అంతిమ లక్ష్యం .. పదవి కాదు .. ప్రజల శ్రేయస్సే. పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ .. మొక్కవోని దృఢ నిర్చయంతో పవన్ ప్రజల కోసం .. ప్రజల తరపున పోరాడుతూ వస్తున్నారు.

పవన్ దగ్గరికి ఓ సమస్య వెళ్తే … దానికి ఖచ్చితంగా పరిస్కారం దొరుకుతుంది అని చాలామంది నమ్ముతారు. ఇకపోతే ఎన్నికల తర్వాత .. బీజేపీ తో పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు.

అయితే హిందత్వవాదాన్ని బాగా పాటిస్తున్నారు. అలాగే మద్దతుగా నిలుస్తున్నారు. ఇకతాజాగా అంతర్వేది ఘటన పై పవన్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.

అయితే .. రెచ్చగొట్టే ప్రసంగాలతో మత విద్వేషాన్ని రేకెత్తించే ఇతర రాజకీయ నాయకుల మాదిరిగా కాకుండా ఇప్పటివరకు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్.

ఏ మతం పై ప్రత్యేకించి ప్రత్యక్ష దాడిని ప్రోత్సహించలేదు చేయలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్విట్టర్ పోస్టులో తన రాజకీయ సంస్థ జనసేన పార్టీ పవన్ హిందూ ముస్లిం మరియు క్రైస్తవుడిగా మూడు అవతారాలు ధరించిన ఓ ఫోటోను ట్వీట్ చేసింది.

“మీ మతాన్ని ప్రేమించండి… పరమతాన్ని గౌరవించండి ”అని పవన్ తన అభిమానులందరికీ ఈ దేశ పౌరులకు విజ్ఞప్తి చేశారు.

ఏదేమైనా పవన్ అభిమతం ఏమిటో ఈ ఫోటోతో మరోసారి తేటతెల్లం అయింది. ప్రస్తుతం ఈ ఫోటో ..సోషల్ మీడియా లో వైరల్అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *