రాజమౌళి కుటుంబానికి కరోనా ఎలా సోకిందంటే?

thesakshi.com    :   బాహుబలి సృష్టికర్త.. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళికి కరోనా అని తెలియగానే టాలీవుడ్ మొత్తం షాక్ కు గురైంది. అందరూ ఆయన కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

రాజమౌళి స్వయంగా తనకు తన కుటుంబానికి కరోనా పాజిటివ్ గా తేలిందని చెప్పడంతో పాటు ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంటున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

రాజమౌళికి ఎలా కరోనా సోకిందని ఆరాతీయగా.. ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. దర్శకుడు రాజమౌళిది ఉమ్మడి కుటుంబం. అందరూ హైదరాబాద్ లో ఒకే అపార్ట్ మెంట్ లో వివిధ ప్లాట్స్ లో నివసిస్తుంటారు.

పక్కపక్కనే ఉండడంతో ఉదయం సాయంత్రం కలుసుకోవడం.. వారాంతాల్లో గెట్ టు గెదర్ లా కలిసిమెలిసి జీవిస్తుంటారు.

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కీరణవాణి ఫ్యామిలీ తండ్రి శివశక్తిదత్తా ఇలా అందరూ ఒకే చోట కలిసి అన్యోన్యంగా ఉంటారు.

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి గత రెండేళ్ల క్రితం సూర్యాపేట జిల్లా వద్ద దాదాపు 100 ఎకరాల ఫామ్ హౌస్ ను కొనుగోలు చేశారు.

వీరికి ఏమాత్రం విరామం దొరికినా కుటుంబాలతో కలిసి అందరూ ఆ ఫామ్ హౌస్ కు వెళ్తుంటారు.

తాజాగా లాక్ డౌన్ సమయంలోనూ కరోనా ప్రబలడంతో అందరూ కలిసి ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడే కొంతకాలం ఉన్న తర్వాత ఇటీవలే హైదరాబాద్ కు వచ్చారని తెలిసింది.

కాగా వీరు వచ్చీరాగానే కుటుంబంలో అందరికీ జ్వరం రావడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. పెద్దగా లక్షణాలు లేకపోవడంతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

కాగా రాజమౌళి ఫామ్ హౌస్ లో ఉన్న ఎవరికో ఒకరికి కరోనా సోకి ఉంటుందని.. తద్వారా రాజమౌళి కుటుంబానికి వ్యాపించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *