బంగారంపైనే ఇన్వెస్టర్ల పెట్టుబడులు

thesakshi.com   :   ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం పెరుగుతుంటే… బంగారం ధరలు అంతగా తగ్గట్లేదు. ధంతేరస్ తర్వాత ధరలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ… రోజురోజుకూ ప్రపంచ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో… ఇన్వెస్టర్లు డాలర్ పై కంటే బంగారంపైనే పెట్టుబడులు పెడుతున్నారు. దానికి తోడు ద్రవ్యోల్బణం  కూడా బంగారం ధరలు అంతగా తగ్గకపోవడానికి కారణం అవుతున్నాయి.

నేటి బంగారం ధరలు (21-11-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.49,830 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.20 తగ్గింది. తులం బంగారం కావాలంటే… దాని ధర రూ.39,864 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.16 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,983 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,830 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.20 తగ్గింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.40,664 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.16 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.5,083 ఉంది.

నేటి వెండి ధరలు (21-11-2020): వెండి ధర రెండు రోజులు భారీగా తగ్గింది. కేజీ ధర రూ.2010 తగ్గింది. తాజాగా ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.61,600 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. తులం వెండి ధర ప్రస్తుతం రూ.492.80 ఉంది. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.61.60 ఉంది. సెప్టెంబర్ 24న వెండి ధర కేజీ రూ.57,000 ఉంది. అప్పటితో పోల్చితే… ప్రస్తుతం వెండి ధర రూ.4,600 ఎక్కువగా ఉంది.

పెట్టుబడి పెట్టాలా వద్దా?: బంగారంలో పెట్టుబడి పెట్టమని చాలా ఫైనాన్షియల్ సంస్థలు మిమ్మల్ని పదే పదే కోరుతూ ఉంటాయి. బంగారంలో పెట్టుబడి పెడితే… తిరుగులేని లాభాలొస్తాయనీ… మంచి రిటర్న్స్ పొందొచ్చని ఊరిస్తాయి. నిపుణులు మాత్రం జాగ్రత్తగా ఉండాలంటున్నారు. బంగారం పరిస్థితి బాగోలేదనీ… ప్రస్తుతం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపించట్లేదని అంటున్నారు. ఒకవేళ పెరిగినా… కరోనాకి వ్యక్సిన్ పంపిణీ మొదలైతే… బంగారం ధరలు భారీగా పతనం అవుతాయని అంటున్నారు. పెట్టుబడి పెట్టాలనుకునేవారు అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకొని అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోమంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *