జనసేన సభ లో జగన్ కు నమస్కారం ..!

సాధారణంగా ఏదైనా ఒక పార్టీ ఒక సభ ని ఏర్పాటు చేస్తే ఆ పార్టీ అధినేతని ప్రశంసించడం .. ఆయనకి నమస్కారం చెప్పడం మాములే. అందరిలాగా నేను కూడా అదే చెప్తే ఏంబాగుంటుంది అని అనుకుందో ఏమో కానీ ఒక మహిళ జనసేన సభకి కి వచ్చి ..జనసేన అధినేత జగనన్నకు నమస్కారం స్వాగతం అంటూ చెప్పింది. దీని తో అక్కడున్న వారందరు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తరువాత తాను చేసిన పొర పాటుని గుర్తించిన ఆ మహిళ తప్పుని సరిదిద్దుకుంది.

అయితే ఆ మహిళ ఆలా మాట్లాడగానే .. జనసేన పార్టీ వర్గాలతోపాటు పవన్ కల్యాణ్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ప్రాంగణం నవ్వులతో నిండిపోయింది అని సమాచారం. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే .. చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ .. రాయలసీమ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా మదనపల్లిలో పవన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా కు చెందిన డ్వాక్రా మహిళా సంఘమిత్ర సొసైటీ సభ్యులతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.

పవన్ ఏర్పాటు చేసిన సమావేశానికి మహిళలు పెద్ద సంఖ్య లో తరలివచ్చారు. ఈ సమయం లో ప్రస్తుతం రాష్ట్రం లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ సందర్భంగా ఒక మహిళ వేదికపైకి వచ్చి మాట్లాడిన సందర్భం లో ‘గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు జగనన్న గారికి’’ అంటూ మాట్లాడింది. దీనితో ఉలిక్కి పడిన జనసేన నేతలు పార్టీ వర్గాలు.. ఆ మహిళ కు ఇది వైసీపీ మీటింగ్ కాదు.. జనసేన మీటింగ్ అని గుర్తు చేశారు. ఏదైనా కూడా మనసు లో జగనన్న ఉంటె పైకి పవన్ అన్న ఎలా వస్తాడు అని కొందరు వైసీపీ నేతలు దీని పై స్పందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *