హిందీ మార్కెట్ దృష్ట్యా అజయ్ దేవగన్ ని సెలెక్ట్ చేసిన జక్కన్న

thesakshi.com   :   టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ ఎన్టీఆర్ జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది.

ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

తాజాగా సినిమాకి సంబంధించిన లోగోను మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం మంచి రెస్పాన్స్ పొందింది.

అంతేకాకుండా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ లుక్ ని విడుదల చేసి ఔరా అనిపించింది.

ఈ ఫస్ట్ లుక్ వీడియో పలు భాషలలో విడుదలై ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ చరణ్ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కంటే ముందు ఈగ సినిమాను హిందీలో విడుదల చేయాలని జక్కన్న అనుకున్నప్పుడు అజయ్ కాజోల్‌ను కలిశారట. హిందీ వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ఇద్దరు వెంటనే ఒప్పుకొన్నారట.

ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ కోసం కలిసి పని చేస్తున్నట్లు తెలిపాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర చాలా గొప్పగా ఉంటుందని రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఆ పాత్ర ఎలా ఉండబోతుంది అని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో అజయ్ దేవగన్ రాంచరణ్ ఎన్టీఆర్ లకు యుద్ధ విద్యలు నేర్పిన గురువు పాత్రలో కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అలాంటి పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవి లాంటి మెగా హీరో చేసి ఉంటే అదిరిపోయేదని అందరూ భావిస్తున్నారు.

కానీ రాజమౌళి హిందీ మార్కెట్ దృష్ట్యా అజయ్ దేవగన్ ని సెలెక్ట్ చేసాడని టాలీవుడ్ కోడై కూస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *