అసూయ పుట్టే విధంగా అనసూయ అందాలు

thesakshi.com   :    తెలుగు బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ గ్లామరస్ బ్యూటీ ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది.

ఇటు టీవీ షోలు అటు సినిమాలను సమానంగా బాలన్స్ చేస్తోంది. ఇక షోలలో స్టేజి పై తన అందాలతో మాయ చేయడం అనసూయకు కొత్తేమీ కాదు. అలాగని టీవీలో.. సినిమాలలో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా అమ్మడి అందాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.

ఈ మేరకు తాజాగా అనసూయ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. స్టార్ హీరోయిన్లకు అసూయ పుట్టే విధంగా అనసూయ అందాలు కుర్రకారును అట్రాక్ట్ చేస్తున్నాయి.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనసూయ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండి డ్రెస్సింగ్ స్టైల్స్ తో అభిమానులను ఆకర్షిస్తుంది.

తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఫోటోలో బ్లాక్ కలర్ స్కర్ట్ లో వయ్యారాలు ఒలకబోస్తూ కొంటె లుక్ లో దర్శనమిచ్చింది.

కేవలం అందంగా కనిపించడమే కాదు అందుకు తగట్టుగా మంచి స్మైల్ గా ముస్తాబవడం కూడా అనసూయకు తెలిసిన విద్యే. సోషల్ మీడియాలో అనసూయకు స్టార్ హీరోయిన్లలాగే భారీ ఫాలోయింగ్ ఉండటంతో ఈ ఫొటోకు లైక్స్ వర్షం కురుస్తోంది.

ఇక అభిమానులు ఊరుకుంటారా.. సూపర్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్లతో పొగిడేస్తున్నారు. సినిమాలలో కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా విలక్షణ పాత్రలు పోషిస్తూ మెప్పిస్తోంది.

అందులో భాగంగానే క్షణం రంగస్థలం సినిమాలతో మంచి నటిగా అనసూయ గుర్తింపు పొందింది. త్వరలోనే కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందట అమ్మడు. చూడాలి మరి ఎలా మెప్పించనుందో..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *