పెళ్లి కావాలంటే మూడ్ రావాలి

30 ప్లస్ భామలకు అభిమానుల నుంచి ఎదురయ్యే మొదటి ప్రశ్న పెళ్లెప్పుడు? అభిమానులతో పాటు మీడియా ఈ విషయంలో పదే పదే ప్రశ్నిస్తూ వేధిస్తుంటారు. అయితే అలా అడగడం ఆట విడుపు అనుకోవాలా? అన్నది అటుంచితే.. ఆ ప్రశ్న బ్యాచిలర్ బ్యూటీల్ని పదే పదే చిక్కుల్లో పడేస్తుంటుంది.

పెళ్లిపై ఈ ప్రశ్న వినీ వినీ విసిగి వేసారిపోయానని అందాల చందమామ కాజల్ తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్లో వాపోవడం చర్చకు వచ్చింది. అయినా పెళ్లి జరిగితే మీకు చెప్పనా?  నా పెళ్లి కుదరగానే ఆ కబురు ముందుగా నేనే మీకు చెబుతాను. అయినా పెళ్లాడాలంటే మూడ్ రావాలి కదా! అని ఆ వేదికపై అనేస్తూ నవ్వేసిందట. మొత్తానికి చందమామ మాటల్లో వేడి పెరిగిందే అంటూ ఫ్యాన్స్ కవ్వింతగా ఫీలవుతున్నారట.

అన్నట్టు దేశంలో ఎక్కడ సౌతిండియా సెంట్రల్ మాల్ ఉన్నా.. రిబ్బను కటింగుకి మాత్రం కాజల్ నే పిలుస్తున్నారు. షాపింగ్ మాల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైడు ఇన్ కం బాగానే ఆర్జిస్తోందట కాజల్. ఇక ఒక్కో కమిట్ మెంట్ ఏడాది కాంట్రాక్టుకు కోట్లలోనే ముడుతోందని సమాచారం. ఇటీవల విజయవాడ నుంచి అనకాపల్లి వరకూ సౌతిండియా సెంట్రల్ మాల్స్ ఓపెనింగులకు కాజల్ అతిధిగా వెళ్లింది. తాను అడుగు పెట్టిన ప్రతిచోటా జనం గుంపులు గుంపులుగా వచ్చి మీదపడడం .. తన కార్ ని కదలనివ్వకుండా దిగ్భందనం చేయడం విజువల్స్ లో అభిమానులు వాచ్ చేస్తూనే ఉన్నారు మరి!!  దశాబ్ధం పైగా ఈ స్థాయి ఫాలోయింగ్ ని కలిగి ఉండడం గొప్పేనని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *