నాగర్ కోవిల్ కాశీ కేసులో కీలక పురోగతి..!

thesakshi.com    :    అమ్మాయిలు, ఆంటీలు, వివాహిత మహిళల జీవితాలతో చెలగాటం ఆడుకుని జైలుపాలైన ప్లేబాయ్ కాశీ (26) కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ప్రముఖ నటితో కాశీ రాసలీలలు సాగిస్తున్న సమయంలో కొన్ని వీడియోలు తీశాడని, ఆ వీడియోలు పోలీసులకు చిక్కకుండా అతని తండ్రి ల్యాప్ టాప్ లోని సాక్షాలను నాశనం చేశాడని సీబీసీఐడీ అధికారుల విచారణలో వెలుగు చూసింది. కాశీ కేసు ఎఫ్ఐఆర్ లో అతని తండ్రి పేరు చేర్చడం కలకలం రేపింది. కాశీ ల్యాప్ టాప్ లో మాయం అయిన ఆ నటి ఎవరు ? వీఐపీల భార్యలు ఎవరు ?, కోళ్ల ఫామ్ దగ్గర ఏంజరిగింది? అనే విషయం అంతు చిక్కడం లేదు.

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోవిల్ కు చెందిన ప్లే బాయ్ కాశీ (26) ఇప్పటి వరకు సుమారు 150 మందికి పైగా అమ్మాయిలు, వివాహిత మహిళలు, ఆంటీల జీవితాలతో చెలగాటం ఆడుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తొవ్వేకొద్ది కాశీ ఆగడాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని, కాశీ వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే కొందరు పెద్దల కుటుంబ సభ్యులు కాశీ వలలో పడటంతో వాళ్లు అతని మీద ఫిర్యాదు చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నారని పోలీసు అధికారులు అంటున్నారు.

తమిళనాడులో పీజీ పూర్తి చేసిన యువతిని కాశీ వలలో వేసుకున్నాడు. కాశీ అరెస్టు కాకముందు వరకు పీజీ అమ్మాయితో కాశీ ఎంజాయ్ చేశాడు. ఎప్పటిలాగే అందర్నీ మోసం చేసి బ్లాక్ మెయిల్ చేసినట్లు పీజీ అమ్మాని మోసం చేశాడు. ఎక్కడ తన పరువు పోతుందో అనే భయంతో ఇంతకాలం మౌనంగా ఉన్న ఆ అమ్మాయి ఇటీవల తన రహస్య వీడియోలు బయటకు రాకుండా చూడాలని పోలీసులను ఆశ్రయించడంతో సీబీసీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. కోర్టు అనుమతితో జైల్లో ఉన్న కాశీని సీబీసీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

కొన్ని సంవత్సరాల పాటు కాశీ విలాసవంతమైన బైక్ లు, కార్లలో పక్కన అమ్మాయిలను కుర్చోబెట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి ఫ్రీగా పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో కాశీ ఫోటోలు, అతని ఫోజులు చూసి చాలా మంది కాలేజ్ అమ్మాయిలు, వివాహిత మహిళలు అతని వలలో పడిపోయారు. ఆ దెబ్బతో కాశీ అమ్మాయిలు, ఆంటీల జీవితాలతో చెలగాటం ఆడాడు. అయితే 7 నెలలుగా జైల్లో ఉన్న కాశీ ఇప్పుడు పేషంట్ లాగా తయారైనాడు.

ప్లే బాయ్ కాశీ ఇప్పటి వరకు సుమారు 150 మందికి పైగా అమ్మాయిలు, వివాహిత మహిళలు, ఆంటీల జీవితాలతో చెలగాటం ఆడుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తొవ్వేకొద్ది కాశీ ఆగడాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని, కాశీ వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే కొందరు పెద్దల కుటుంబ సభ్యులు కాశీ వలలో పడటంతో వాళ్లు అతని మీద ఫిర్యాదు చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మంది బాధితులు కాశీ మీద ఫిర్యాదు చేశారు. ఇంకా చాల మంది ముందుకు వచ్చి ఫిర్యాదులు చెయ్యాల్సి ఉందని పోలీసు అధికారులు అంటున్నారు

ప్లేబాయ్ కాశీ కేసుకు సంబంధించి అతని స్నేహితుడు డినో (19) అనే యువకుడిని ఇప్పటికే అరెస్టు చేశారు. కాశీ ఇంట్లో, అతని స్నేహితుల ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు కొన్ని ల్యాప్ టాప్ లు, పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు సీజ్ చేశారు. కాశీ తండ్రి తంగపాండియన్ కోళ్ల ఫామ్ లు ఏర్పాటు చేసి ప్రతిరోజు వేల కేజీల చికెన్ హోల్ సేల్ గా విక్రయిస్తున్నాడు. కాశీ కర్మకాండ కేసులోని ఎఫ్ఐఆర్ లో ఇప్పుడు కాశీ తండ్రి తంగపాండియన్ పేరు చేర్చామని సీబీసీఐ అధికారులు శనివారం చెప్పారు.

కాశీలో వలలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి చిక్కుకుందని సీబీసీఐడి అధికారుల విచారణలో వెలుగు చూసింది. కాశీ కేసులో అతని తండ్రి తంగపాండియన్ నిర్వహిస్తున్న కోళ్ల ఫామ్ లో సీబీసీఐ అధికారులు సోదాలు చేశారు. అక్కడ చిక్కిన ల్యాప్ టాప్ లో ఫోటోలు, వీడియోలతో పాటు డేటా మొత్తం డిలీట్ చేశారని అధికారులు గుర్తించారు. కాశీ వలలో చిక్కుకున్న ఆ సినీ నటి ఎవరు ? అనే విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.

సినీ నటితో పాటు, కొందరు వీఐపీల భార్యల నగ్న అశ్లీల వీడియోలు, ఫోటోలు ఆ ల్యాప్ టాప్ లో ఉన్నాయని, తన కోడుకు చేసిన తప్పులు పోలీసులకు చిక్కకుండా అతని తండ్రి తంగపాండిన్ ఆ సాక్షాలు నాశనం చేశాడని సీబీసీఐడీ అధికారులు అంటున్నారు. పోలీసులకు సాక్షాలు చిక్కకుండా తంగపాండియన్ ల్యాప్ టాప్ లోని సాక్షాలు నాశనం చేశాడని అతని మీద కేసు నమోదు చేశారు. కాశీ తండ్రి తంగపాండియన్ ను పోలీసులు అరెస్టు చేశారు. కాశీ మీద అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని, పొర్న్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని, చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించి సెటిల్ మెంట్ లు చేశాడనే కేసులతో పాటు అతని మీద గూండా చట్టం కూడా ప్రయోగించి అనేక సెక్షన్ ల కింద అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *