ఇద్దరితో రిలేషన్ షిప్ మెయింటైన్ చేశా: ఇషా చావ్లా

thesakshi.com   :   ఎఫైర్ల గురించి అందరూ బయటపెట్టుకోరు. అవి పైకి చెప్పడానికి కాస్త ధైర్యం కావాలి. ముద్దుగుమ్మ ఇషా చావ్లాకు అలాంటి ధైర్యం పుష్కలంగా ఉన్నట్టుంది. తను ఇప్పటివరకు ఇద్దరితో రిలేషన్ షిప్ మెయింటైన్ చేశానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

“నా లైఫ్ లో ఇప్పటివరకు 2 ఎఫైర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి అతిపెద్ద రిలేషన్ షిప్. దాదాపు 5-6 ఏళ్లు మేం రిలేషన్ షిప్ లో ఉన్నాం. 2015 వరకు అది కొనసాగింది. రెండో రిలేషన్ షిప్ చిన్నది. ప్రస్తుతానికైతే నాకు ఎలాంటి రిలేషన్ షిప్స్ లేవు. నేను సింగిల్.”

ఇలా తన జీవితంలో ఎఫైర్ల గురించి బయటపెట్టింది ఇషా. అయితే తను డేటింగ్ చేసిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనే విషయాన్ని మాత్రం ఆమె బయటపెట్టలేదు. మరోవైపు పెళ్లిపై, తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలపై కూడా రియాక్ట్ అయింది.

“నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది. అది జరగాల్సిన టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా జరుగుతుంది. కానీ ప్రస్తుతానికైతే నా పెళ్లికి ఇంకా టైమ్ ఉంది. ఈ విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. నాకు కాబోయే భర్త కళ్లలో నిజాయితీ కనిపించాలి. మంచి మనసు ఉండాలి. నాతో సరదాగా ఉండాలి. నేను చేసే ప్రతి పనిని జడ్జి చేసేలా ఉండకూడదు. అంతకుమించి నాకు పెద్దగా క్వాలిటీస్ అక్కర్లేదు. ప్రతి ఒక్కర్లో లోపాలు ఉంటాయి. నేను కూడా పెర్ ఫెక్ట్ కాదు.”

ఎలా పెళ్లి చేసుకోవాలనే అంశంపై తనకు పెద్దగా ప్లాన్స్ లేవంటోంది ఇషా చావ్లా. రేపే తన పెళ్లంటూ ఇనస్టాగ్రామ్ లో ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని… ఆల్రెడీ తనకు పెళ్లయిపోయిందంటూ చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *