భారీగా పెరుగుతున్న బంగారం ధరలు

thesakshi.com    :    ఏప్రిల్, మే, జూన్‌లో బంగారం కొన్నవారు పండుగ చేసుకోవచ్చు. తర్వాత కొందాంలే అని ఎదురుచూసినవారికి నిరాశే. ఎందుకంటే జూలైలో బంగరం ధర రూ.6,000 పెరిగింది. బంగారం, వెండి ధరలు ఏ స్థాయిలో పెరిగాయో తెలుసుకోండి.

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండి అయితే బంగారం కన్నా ఎక్కువ స్పీడుతో దూసుకెళ్తోంది. గోల్డ్ రేట్ రూ.56,000 దాటితే వెండి ధర రూ.65,000 దాటింది.
జూన్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా గోల్డ్ రిటర్న్స్ ఇచ్చాయి. బంగారంపై కాకుండా సిల్వర్‌పై ఇన్వెస్ట్ చేసినవారికీ మంచి లాభమే మిగిలింది.

జూలై 1న మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.48,762. జూలై 31న రేట్ చూస్తే రూ.53,828. అంటే జూలైలో 10 శాతం ధర పెరిగింది.

ఇక హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర జూలై 1న రూ.50950. జూలై 31న ధర రూ.56,490 దగ్గర ఆగింది. అంటే సుమారు రూ.6,000 బంగారం ధర పెరిగింది.

వెండి మాత్రం బంగారాన్ని మించిపోయింది. జూలైలో వెండి ధర రికార్డులు సృష్టించింది. ఎంసీఎక్స్‌తో పాటు దేశీయ మార్కెట్‌లో ధర ఏకంగా 30% పెరిగింది.

ఎంసీఎక్స్‌లో జూలై 1న కిలో వెండి ధర రూ.49,716 ఉండగా జూలై 31న ధర రూ.64,984. సిల్వర్‌పై ఇన్వెస్ట్ చేసిన వారికి 30% రిటర్న్స్ వచ్చాయి.

ఇక హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర భారీగానే పెరిగింది. జూలై 1న కేజీ వెండి ధర రూ.50,050 ఉంటే జూలై 31 నాటికి రూ.65,110 ధర పలికింది. ఏకంగా కిలోపై రూ.15,000 పెరిగింది.

బంగారం మాత్రమే కాదు వెండి కూడా గతంలో ఎన్నడూ లేనంతగా రిటర్న్స్ ఇవ్వడం విశేషం. ఓవైపు కరోనా వైరస్ సంక్షోభం, ఈక్విటీ మార్కెట్స్‌పై ఆశలు లేకపోవడం లాంటి కారణాలతో బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు ఇన్వెస్టర్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *