ఒకటిన్నరేళ్ల కుమారుడితో సహా తల్లి ఆత్మహత్య

thesakshi.com   :    ఒకటిన్నరేళ్ల కుమారుడితో తల్లి ఉరేసుకుంది. స్థానిక పుళల్‌ సమీపం కన్నడ పాళయం జీవా 2వ వీధికి చెందిన రంజిత్‌కుమార్‌ పుళల్‌లో ఉన్న లారీ బుకింగ్‌ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు.

ఆయన రెడ్‌హిల్స్‌ సమీపం సామియార్‌మఠంకు చెందిన భాగ్యలక్ష్మి(22)ని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి మిత్రన్‌ అనే ఒకటిన్నరేళ్ల కుమారుడున్నాడు.

రెండ్రోజుల క్రితం భాగ్యలక్ష్మి కుమారుడిని కొట్టింది. దీంతో ఆగ్రహించిన రంజిత్‌కుమార్‌ భార్యను కొట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఉదయం రంజిత్‌కుమార్‌  విధులకు వెళ్లాడు.

సాయంత్రం 6 గంటల సమయంలో భర్తకు ఫోన్‌ చేసిన భాగ్యలక్ష్మి… ఎప్పుడొస్తారని అడుగ్గా, ఆలస్యమవుతుంది… ఫోన్‌ పెట్టెయ్‌ అంటూ దురుసుగా సమాధానం చెప్పి ఫోన్‌ కట్‌ చేశారు. రాత్రి 7 గంటల సమయంలో భాగ్యలక్ష్మి తల్లి శాంతి ఇంటికి వచ్చింది.

తలుపులు మూసి ఉండడం, ఎంత పిలిచినా సమాధానం లేకపోవడంతో అనుమానించి చుట్టుపక్కల వారికి తెలియజేసింది.

వారు తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లగా మిత్రన్‌తో పాటు భాగ్యలక్ష్మి ఉరేసుకొని విగతజీవులుగా కనిపించారు.

సమాచారం అందుకున్న పుళల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి రంజిత్‌కుమార్‌ను విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *