డైలమాలో ఉండిపోయిన ముంబై బ్యూటీ

thesakshi.com    :    అందమైన జీవితాన్ని… ఆశించినట్టు కెరీర్ ముందుకు సాగాలని ఎవరు కోరుకోరు? .. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే దానిని జీవితం అంటారా? ఇలాంటి డైలమాలోనే ఉండిపోయింది ముంబై బ్యూటీ ప్రగ్య.

ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆశించిన ఒక్క ఛాన్స్ తనకు దక్కడం లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలన్న తన కల నెరవేరలేదు.

తెలుగు చిత్రసీమలో తనకు ఒక మెంటార్ ఉన్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అందం ఉంది… హొయలు ఉంది.. వేడెక్కించే వయ్యారం ఉంది.. కానీ ఏం లాభం? ప్రయత్నం ప్రతిసారీ విఫలమవుతూనే ఉంది.

కంచె లాంటి హిట్టు ఉన్నా కానీ తనకు ఆ తర్వాత సరైన ఆఫర్లు రాలేదు. సరైన హీరోలతో ఒక్క ఛాన్స్ పడలేదు. ఫలితంగా కెరీర్ పరంగా దూకుడు సాగలేదు.

మూడేళ్ల క్రితం ఓ సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత మళ్లీ ఆఫర్ అన్నదే లేదు. కనీసం నవతరం నాయికల్లో చాలా మంది తెలుగులో వెలగకపోయినా.. ఇరుగు పొరుగు భాషల్లో అయినా అవకాశాలు అందుకుంటున్నారు. ప్రగ్యకు అలాంటి ఆఫర్ కూడా లేదు.

ఆ క్రమంలోనే సోషల్ మీడియాల్లో దూకుడు పెంచింది. అక్కడ రెగ్యులర్ గా బికినీలు.. స్విమ్ సూట్లతో వేడెక్కించింది. నిరంతరం జిమ్ చేస్తున్న వీడియోలు.. ఫోటోలతోనే కాలక్షేపం చేసింది. చివరికి బాలీవుడ్ హాటీ దిశాపటానీ ఎత్తుగడల్ని కాపీ చేసి ప్రయోగించింది. ప్చ్.. కానీ ఏం లాభం? ఏ ఉపయోగం లేదు. పిలిచి ఛాన్సులిచ్చేవాళ్లే కరువయ్యారు.

ఈ విరామాన్ని తట్టుకోలేకపోతోందో ఏమో కానీ ఆ విరహం ప్రగ్య షేర్ చేసే ప్రతి ఫోటోలో ప్రతిఫలిస్తూనే ఉంది.

అయితే అసభ్యకరమైన ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేస్తే అవకాశాలిస్తారు! అనేది భ్రమ అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.

దానికంటే ప్రణాళికా లోపం ఎక్కడ? అన్నది తెలుసుకుంటేనే బెటర్ అనేది చాలామంది సూచన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *