ప్యాంట్ స్టిక్కర్ ఆధారంగా మర్డర్ కేస్ ఛేదించిన ఖాకీలు

thesakshi.com    :    ప్యాంట్ స్టిక్కర్ ఓ హతంకుడిని పట్టించిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వెంకట శివప్రసాద్‌(56) 30 ఏళ్ల కిందట హైదరాబాద్‌ నగరానికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ ఫుట్‌పాత్‌ పడుకుంటున్నాడు.

ఈ నెల 26న బాలానగర్‌ టీ జంక్షన్‌ వద్ద ఒంటిపై గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి బాలానగర్ ఎస్‌ఐ రమేష్‌ సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించగా.. ఓ వ్యక్తి వెంకట శివప్రసాద్‌పై కూర్చొని మొహంపై కొట్టడం, తలను బాదడం కనిపించింది. ముఖానికి మాస్కు ఉండటంతో నిందితుడిని గుర్తించడం పోలీసులు కష్టంగా మారింది.

అయితే నిందితుడి ప్యాంటుపై మోకాలి వద్ద ఒక రేడియం స్టిక్కర్‌ను గుర్తించిన పోలీసులు ఫతేనగర్‌ వంతెన కింద నివసించే వారి దుస్తులను పరిశీలించగా ఓ గుడిసెలో ఆ ప్యాంటు లభ్యమైంది. దాని ఆధారంగా నిందితుడిని బోయిన్‌పల్లి ఎంఎంఆర్‌ గార్డెన్స్‌ వద్ద నివసించే పాత నేరస్థుడు పి.నాగరాజు(33)గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు.

ఈ నెల 26న తెల్లవారుజామున టీ జంక్షన్‌లో ఓ దుకాణంలో దొంగతనం చేస్తుండగా అక్కడే ఫుట్‌పాత్‌పై పడుకున్న వెంకట శివప్రసాద్ పెద్దగా కేకలు వేశాడని, తన గురించి బయటకు చెప్పేస్తాడన్న ఆందోళనతో అతడిని చంపేశానని చెప్పాడు. హత్య అనంతరం అతడి జేబులోని రూ.200 తీసుకుని తాను పరారైనట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *