thesakshi.com : నీవేనా నను తలచినది.. నీవేనా నను పిలచినది.. నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరిచినది.. నీవేనా?
“నీవేలే నను తలచినది.. నీవేలే నను పిలచినది.. నీవేలే నా మదిలో నిలిచి హృదయము కలవరపరిచినది“..
“కలలోనే ఒక మెలకువగా.. ఆ మెలకువలోనే ఒక కలగా.. కలలోనే ఒక మెలకువగా.. ఆ మెలకువలో ఒక కలగా.. కలయో నిజమో వైష్ణవ మాయో.. తెలిసీ తెలియని అయోమయంలో.. నీవేనా నను తలచినది….!!“
ఇదిగో ఇక్కడ ప్రియానిక్ సీన్ చూస్తుంటే ఇదిగో ఇదే క్లాసిక్ గీతం గుర్తుకొస్తోంది. ఎస్వీఆర్ -ఏఎన్నార్- సావిత్రి వంటి లెజెండ్స్ నటించిన మాయాబజార్ చిత్రంలోనిది ఈ క్లాసిక్ గీతం.
సరిగ్గా చూస్తే ప్రేమికులు లేదా భార్యాభర్తల మధ్య అనుబంధం అంత అందంగా ఉంటుందా? అనిపించే లా అద్భుతమైన లిరిక్ రాశారు ఆరోజుల్లో.
తాజాగా ప్రియాంక చోప్రా జోనాస్ తన భర్త నిక్ జోనాస్ మధ్య ప్రేమానుబంధానికి సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేసి దానికి అందమైన కొటేషన్ ఇచ్చింది. “ఎప్పటికీ నా వ్యక్తి … మీకు చాలా కృతజ్ఞతలు నిక్ జోనాస్“ అంటూ భర్తకు లాలనగా క్యాప్షన్ ఇచ్చింది.
సరికొత్త హ్యారీకట్ హెయిర్ కట్ తో మతి చెడగొడుతున్న పీసీ ఇటీవల వరుసగా ప్రయోగాలకు సిద్ధమవుతోంది. తదుపరి తన జ్ఞాపకాల్ని `అన్ ఫినిష్డ్` పేరుతో పుస్తకంగా రాస్తోంది. త్వరలో ఈ పుస్తకాన్ని విడుదల చేయనుందిట. ఇక పీసీ నటిస్తున్న `ది వైట్ టైగర్` సిరీస్ డిజిటల్లో స్ట్రీమింగ్ కానుంది.