నవ వధువు ఆత్మహత్య

thesakshi.com    :    పారాణి ఆరలేదు.. తోరణాలు వాడలేదు. సందళ్లు ఆగలేదు.. సంబరాలకు సరిలేదు.

నవ జంట నిండు నూరేళ్లూ ఆనందంగా జీవించాలని అందరి ఆకాంక్ష. ఊహించని దరిమిలా నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం ఆ ఇంట అంతులేని విషాదాన్ని నింపింది.

ఈ ఘటన ఏడిద సీతానగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్‌ఛార్జి ఎస్సై శివప్రసాద్‌ వివరాల మేరకు… ఏడిద సీతానగరానికి చెందిన మహాదాసు రమ్య శ్రీదేవి(20)కి మూడు రోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణపురం గ్రామంలో ఉంటున్న మేనమామతో బుధవారం వివాహమైంది.

శుక్రవారం మధ్యాహ్నం ఆమె ఎలుకల మందు తింది. అస్వస్థతకు గురైన ఆమెను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది.

దీంతో పెళ్లింట విషాదం అలుముకుంది. ఉన్నత చదువులు చదివేందుకు కుదరదనే బాధతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని బంధువులు భావిస్తున్నారు.

తహసీల్దారు నాగలక్ష్మి వివరాలు నమోదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *