భారీ బడ్జెట్ తో నితిన్ సినిమా

thesakshi.com    :    యంగ్ హీరో నితిన్ కెరీర్ అయితే వరస విజయాలు, లేదంటే వరస పరాజయాలు అన్నట్లుగా సాగుతుంటుంది. వరసగా 12 ప్లాపుల తర్వాత ఇష్క్ చిత్రంతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన నితిన్, ఆ తర్వాత వరసగా మూడు విజయాలు అందుకున్నాడు. త్రివిక్రమ్ తో చేసిన అ.. ఆ చిత్రం నితిన్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్. అయితే ఆ తర్వాత నితిన్ కెరీర్ మళ్ళీ గాడి తప్పింది. వరసగా నాలుగు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నితిన్ భీష్మ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇదే ఊపులో 2020ను యమా బిజీగా గడిపేద్దామని భావించాడు. నితిన్ చేతిలో ఇప్పుడు నాలుగు చిత్రాలున్నాయి.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రాన్ని చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయింది. ఇది కాకుండా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ చిత్రాన్ని చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ హిట్ మూవీ అంధధూన్ రీమేక్ ను తెలుగులో చేయబోతున్నట్లు ప్రకటించాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా ముహూర్తం కూడా జరిగింది. ఈ చిత్రాల తర్వాత నితిన్ తన కెరీర్ లో అత్యంత భారీ సినిమాను అటెంప్ట్ చేయబోతున్నాడు.

తన స్నేహితుడు, తనతో ఛల్ మోహన్ రంగా తీసిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ సినిమా చేయబోతున్నాడు. పవర్ పేట అనే టైటిల్ ఉన్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట. నితిన్ మార్కెట్ పరంగా 40-50 కోట్ల రేంజ్ లోనే ఉన్నాడు. మరి అలాంటి హీరోతో 90 కోట్ల సినిమా అంటే అది కచ్చితంగా రిస్కేమో కదా!

One Comment on “భారీ బడ్జెట్ తో నితిన్ సినిమా”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *