మరోసారి ఉలిక్కిపడిన తెలుగుచిత్ర పరిశ్రమ

thesakshi.com    :    వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరిని వదిలిపెట్టటం లేదు కరోనా మహమ్మారి.

ప్రముఖులు నుంచి సామాన్యుల వరకు.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి నుంచి సెలబ్రీల వరకు కరోనా దెబ్బకు బెంబేలెత్తిపోతున్నారు.

బాలీవుడ్ తో పోలిస్తే.. టాలీవుడ్ లో ఇప్పటివరకూ కరోనా బారిన పడినోళ్లు తక్కువే.

ఆ మధ్యన నటుడు కమ్ నిర్మాత అయిన బండ్ల గణేశ్ కరోనా పాజిటివ్ అన్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో కాస్త పేరున్న వారిలో పాజిటివ్ గా నమోదైన బండ్ల గణేశ్ వ్యవహారం పలువురిలో కలవరాన్ని రేపింది.

ఆ తర్వాత కొద్దిగా విరామం ఇచ్చిన కరోనా.. ఈ మధ్యన దర్శక ధీరుడు రాజమౌళికి సోకటంతో టాలీవుడ్ విస్మయానికి గురైంది. ఎందుకంటే.. ఫామ్ హౌస్ లో ఉంటున్న రాజమౌళి.. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతారు.

అలాంటి ఆయనే కరోనా బారిన పడటం చిత్ర పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. తాజగా టాలీవుడ్ కు చెందిన యువ నిర్మాత ఒకరికి కరోనా సోకిన వైనం బయటకు వచ్చింది.

ఇటీవల వరుస సినిమాలు నిర్మిస్తూ.. రెండు విజయాల్ని సొంతం చేసుకున్న సదరు నిర్మాత తాజాగా టెస్టు చేయించుకున్నట్లు చెబుతున్నారు.

తాజాగా ఫలితం వచ్చిందని.. పాజిటివ్ గా తేలటంతో.. హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ వార్త.. తెలుగుచిత్ర పరిశ్రమను మరోసారి ఉలిక్కిపడేలా చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *