కొనసాగుతున్న వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ

thesakshi.com    :    మాజీ మంత్రి వై.ఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 14వ రోజు కొనసాగుతోంది.

కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో జరుగుతున్న విచారణకు వివేకా వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మీదేవి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయ్‌ తుల్లా శుక్రవారం హాజరయ్యారు.

విచారణకు హాజరయ్యేందుకు ముగ్గురూ ఒకే కారులో పులివెందుల నుంచి కడపకు వచ్చారు. వీరు విచారణ గదిలోకి వెళ్లిన కాసేపటికే వివేకా కుమార్తె సునీత కూడా విచారణకు హాజరయ్యారు. సునీతను సీబీఐ అధికారులు ప్రశ్నించడం ఇది మూడో సారి.

అయితే వివేకా చనిపోయిన రోజు అసలు ఏం జరిగింది? అనే దానిపై ఈ ముగ్గురినీ ఇవాళ సునీత సమక్షంలోనే సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

గత ఏడాది మార్చి 15న ఉదయం 5.30 గంటలకు మొదటిగా వివేకా ఇంటికి వెళ్లింది ఆయన వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డే. ఆయన తలుపు తీసి చూస్తే బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో వివేకా శవమై కనిపించారు.

అనంతరం కృష్ణారెడ్డి వివేకా మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వివేకా బెడ్‌రూమ్‌లో కృష్ణారెడ్డికి ఒక లేఖ కూడా దొరికింది. కానీ ఆ లేఖను సాయంత్రం వరకు పోలీసులకు ఇవ్వలేదు.

సాయంత్రం వివేకా కుమార్తె సునీత సమక్షంలో లేఖను కృష్ణారెడ్డి పోలీసులకు అప్పగించారు. గతంలో కృష్ణారెడ్డిని సిట్‌ అధికారులు అరెస్ట్‌ కూడా చేశారు. ప్రస్తుతం అతను బెయిల్‌పై ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *