ప్రభాస్ మళ్లీ వెకేషన్.. అసలేం జరుగుతోంది?

రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే సాహో రిలీజ్ అనంతరం యూరప్ టూర్  వెళ్లి హైదరాబాద్ కు రిటర్న్ అయ్యాడు. సాహో రిజల్ట్ విషయంలో తానొకటి ఊహిస్తే ఇంకేదో అయ్యింది. ఆ పెయిన్ నుంచి బయటపడటానికి అలా టూర్ వెళ్లి రిలాక్స్ అయి వచ్చాడని ప్రచారమైంది. ఇక అన్నిటినుంచి బయటపడుతూ కరెక్షన్స్ తో .. మునుపటిలా యథావిధిగా మళ్లీ జాన్ షూటింగ్ లో భాగం జాయిన్ కానున్నాడని భావించారంతా. గతం వదిలేసి వర్తమానంలో ఫ్రెష్ మైండ్ తో రీఫ్రెష్ మోడ్ లోకి వచ్చేశాడని అనుకున్నారు. కానీ అలా జరుగుతున్నట్లు లేదని తాజా సన్నివేశం చెబుతోంది. ప్రభాస్ టూర్ నుంచి తిరిగి వచ్చాక అసలు జాన్ విషయమే పట్టనట్లు వ్యవరించాడన్నది తాజా గుసగుస.

ఓవైపు రామోజీ ఫిలింసిటీలో ఫారిన్ కి సంబంధించిన సెట్లు వేసి షూటింగుకి ప్రిపేర్ చేస్తున్నాయని వార్తలొచ్చాయి. కానీ ఇంతలోనే ఏమైందో.. డార్లింగ్ మరోసారి ఫారిన్ చెక్కేస్తున్నాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది. హైదరాబాద్  రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ కెమెరాకు చిక్కడంతోనే చిక్కొచ్చిపడింది. దీంతో వివరాలు ఆరాలు తీయగా  ఆయన సన్నిహిత వర్గాల నుంచి డార్లింగ్ మరోసారి వెకేషన్ కు వెళ్తున్నాడని వెల్లడైంది. తన ఎంతో క్లోజ్ అయినవారితో మాత్రమే ఈ హుటాహుటీ వెకేషన్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది. యూరప్ వెళ్లినప్పుడు ఒక్కడే ఒంటరిగా వెళ్లొచ్చాడు. కానీ ఈసారి ట్రిప్ కి స్నేహితులతో ఇంకాస్త జాలీ గా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడన్న ప్రచారం  తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలో ప్రభాస్ జాన్  సెట్స్ కి ఇప్పట్లో జాయిన్ కాడని.. కొత్త ఏడాదిలోనే టీమ్ తో జాయిన్ కానున్నాడని వినిపిస్తోంది. మరి నిజంగా  ఫారిన్ వెకేషన్ కి  వెళ్తున్నాడా? ఏదైనా సడెన్ పనిమీద  వెళ్తున్నాడా? అన్నది ప్రభాస్ క్లారిటీ  ఇస్తే కానీ వివరం తెలియదు. ఏదేమైనా ఈ వార్తలు అభిమానులను కాస్త నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. మొన్న యూరప్ వెళ్లొచ్చాడు. ఇంతలోనే మళ్లీ వెకేషన్ ఎందుకు? అన్న చర్చ అభిమానుల్లో సాగుతోంది. ఇది పలు సందేహాలకు తావిస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *