ఓటీటీ బాటలో లో రెడ్ మూవీ ?

thesakshi.com   :   కొన్ని వరుస పరాజయాల తర్వాత ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు రామ్. ఆ తర్వాత వరుసగా తెలివైన ఎంపికలతో దూసుకుపోవాలన్నది ప్లాన్. ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ఇది. నివేతా పెథురాజ్ కథానాయిక. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామ్ లో డ్యూయల్ షేడ్ సినిమాపై ఆసక్తిని పెంచింది. కిషోర్ తిరుమల ఈసారి సరికొత్త కాన్సెప్టును ఎంపిక చేశాడని అర్థమైంది.

ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. చిత్రీకరణ సహా నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయి. మహమ్మారీ లాక్ డౌన్ వల్ల ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిన సంగతి విధితమే.

గత కొంతకాలంగా ఓటీటీ రిలీజ్ కి రెడ్ రెడీ అవుతోందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. వరుసగా క్రేజీ సినిమాలన్నీ ఓటీటీకే క్యూ కడుతున్నాయి కాబట్టి రెడ్ కూడా ఖాయమైనట్టేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది.

రామ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందట. అంతేకాదు.. ఇటీవల విడుదలైన పెంగ్విన్- వి లాంటి చిత్రాలకు ఆశించిన రెస్పాన్స్ రాకపోవడం ఆలోచింపజేస్తోందట. మరి రెడ్ ఓటీటీలో వస్తుందా లేదా? అన్నది స్రవంతి అధినేత ప్రకటిస్తారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *