అకీరా ఏ వృత్తిని ఎంచుకున్నా సపోర్ట్ చేస్తానన్న రేణు

thesakshi.com    :   పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంటర్ ఫెయిలై ఏదీ సాధించలేనని ఆత్మహత్యకు ప్రయత్నించడం.. ఆ తర్వాత అన్నయ్య బుద్ధి చెబితే.. అనుకోకుండానే సినిమాల్లోకి రావడం.. ఇక్కడ హీరోగా పెద్ద సక్సెస్ అవ్వడం అదంతా ఒక పెద్ద స్టోరీ. అన్నయ్య తర్వాత మళ్లీ ఆ స్థానాన్ని ఆక్రమించిన తమ్ముడిగా అతడి పేరు ప్రఖ్యాతులు స్కైని టచ్ చేశాయి. సౌత్ లో సూపర్ స్టార్ గా తనని తాను నిరూపించుకున్నారు పవన్. తాను ఏం చేసినా మనసు పెట్టి చేస్తానని అలా చేస్తే సక్సెస్ దూరమవ్వదని పవన్ చెబుతుంటారు.

అదంతా సరే కానీ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడు బరిలో దిగేదెప్పుడు? అకీరా నందన్ సినీఎంట్రీ ఇస్తాడా ఇవ్వడా? అంటే ఇటీవల ఇక ఎంతో సమయం లేనే లేదని మీడియాలో కథనాలొచ్చాయి. కానీ అకీరా ఎంట్రీకి ఇప్పుడే తొందరేమీ లేదని పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అకీరా వయసు 16. తనకు ఎంతో భవిష్యత్ ఉంది. తను ఏ వృత్తిని ఎంచుకున్నా సపోర్ట్ చేస్తానని రేణు తెలిపారు. నాన్న పెదనాన్న అన్నలు పెద్ద స్టార్లు కాబట్టి తాను కూడా స్టార్ కావాలనే ఒత్తిడి తేలేనని కూడా వెల్లడించారు. అనవసర భారం వేయను.. ఒత్తిడి తేను అని తెలిపారు. తనకు నచ్చిన కెరీర్ ఎంచుకోమని చెబుతానని అన్నారు.

దీంతో అకీరా ఇప్పట్లో హీరో అయ్యే ఛాన్సే లేదని అర్థమవుతోంది. అయితే అతడు నూనూగు మీసాల వయసులో ఉన్నాడు కాబట్టి ఔత్సాహిక దర్శకులు టీనేజీ లవ్ స్టోరీలతో సంప్రదించే వీలుందని ఇదివరకూ ఫిలింనగర్ లో గుసగుసలు వినిపించాయి. ఇక ఒక స్టార్ గా కంటే మంచి మనిషిగా బతకడం చాలా ముఖ్యమని చెబుతానని రేణు అనడం ఆసక్తికరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *