#RRR భారీ ప్లాన్ వేసిన జక్కన్న..

thesakshi.com    :      రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ను కలిగి ఉంది.

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా అవ్వడంతో సహజంగానే హిందీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఈ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు.

సినిమాకు మరింత బిజినెస్ కోసం అజయ్ దేవగన్ పాత్రను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. అజయ్ దేవగన్ పాత్ర ఏదో సాదా సీదాగా కాకుండా హీరోల స్థాయిలో ఉండేలా జక్కన్న కథనం అల్లుతున్నాడట.

ఇద్దరు హీరోలకు గురువు పాత్రలో అజయ్ దేవగన్ కనిపించబోతున్నాడు. మొదట ఆ పాత్ర సీన్స్ ను తక్కువ అనుకున్నా కూడా బాలీవుడ్ లో బిజినెస్ కోసం ఆ పాత్రను పొడగించినట్లుగా టాక్ వినిపిస్తుంది.

బాలీవుడ్ స్టార్ అయిన అజయ్ దేవగన్ ను ఫుల్ లెంగ్త్ రోల్ లో నటింపజేయడం వల్ల సినిమాపై అంచనాలు మరింతగా పెంచడంతో పాటు సినిమాకు అధిక మార్కెట్ క్రియేట్ చేయవచ్చు అనేది జక్కన్న ప్లాన్ గా తెలుస్తోంది.

అజయ్ దేవగన్ బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్ర మాదిరిగా ఉంటుందని అంటున్నారు. బాహుబలి విడుదల అయ్యి ఇన్నాళ్లు అయినా కూడా కట్టప్ప పాత్ర గురించి చర్చ జరుగుతూనే ఉంది.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర ఉంటుందని.. ఎప్పటికి నిలిచి పోయే విధంగా ఈ చిత్రంలో అజయ్ దేవగన్ కనిపించబోతున్నాడు అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

షూటింగ్ కరోనా కారణంగా నిలిపేసిన జక్కన్న ఈ ఏడాది చివరి వరకు సినిమాను మళ్లీ మొదలు పెట్టి వచ్చే ఏడాది జులై వరకు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *