బాహుబలి ని మించి ఆర్ ఆర్ ఆర్ సినిమా

thesakshi.com   :    దర్శక ధీరుడు రాజమౌళి తన ప్రతి సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూనే ఉన్నాడు. బాహుబలి వంటి సినిమాను తీసిన తర్వాత జక్కన్న మళ్ళీ అంతటి సినిమా ను తీయగలడా అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు.

అద్భుతాలు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి. బాహుబలి వంటి సినిమాలు ఎప్పుడు రావు. జక్కన్న కూడా అంతటి విజువల్ వండర్ ను తీయ లేక పోవచ్చు అన్నారు. కానీ ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా బాహుబలి ని మించి ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకం గా చెబుతున్నారు.

తాజాగా బాహుబలికి మాటల రచయితగా వ్యవహరించిన మాధన్ కార్కి ఆర్ ఆర్ ఆర్ సినిమాపై అంచనాలు పెరిగేలా వ్యాఖ్యలు చేశాడు. బాహుబలితో పోల్చితే ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని చాలా సీన్స్ పది రేట్లు అధికంగా గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయి.

సినిమా లో హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ ఇంకా అనేక సీన్స్ బాహుబలి సీన్స్ కంటే అద్భుతం గా ఉంటాయంటూ తాజా ఇంటర్వ్యూ లో మాధన్ కార్కి అన్నాడు. ఆయన వ్యాఖ్యలు సినిమా పై అంచనాలు మరింత గా పెంచేవి గా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *