రోజుకో మలుపు తిరుగుతున్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు

thesakshi.com   :   సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇందులో డ్రగ్స్ కేసు ఇన్వాల్వ్ కావడంతో బిగ్ షాట్స్ అంతా బయటపడుతున్నారు.

చాలా మంది తిమింగళాలు అడ్డంగా దొరికిపోయే సన్నివేశమే కనిపిస్తోంది. ఇప్పటికే 25 మంది పేర్లను రియా వెల్లడించగా అందులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ పేరు కూడా వినిపించింది.

తాజాగా ఈ కేసులో రియా చెప్పిన పేర్లలో అగ్రశ్రేణి నిర్మాత ఒకరు ఉన్నారని.. ఆయనే తనని సుశాంత్ సింగ్ ని మాదక ద్రవ్యాల మత్తు ప్రపంచానికి పరిచయం చేశారని రియా నార్కోటిక్స్ అధికారులకు వెల్లడించిందట.

ఇప్పటికే రియా సహా ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపబడ్డారు. శుక్రవారం రియా బెయిల్ పిటిషన్ను సెషన్స్ కోర్టు తిరస్కరించింది.

న్యాయవాది నివేదికల ప్రకారం ఈ సోమవారం హైకోర్టుకు అప్పీల్ చేస్తారు. సిబిఐతో రియా మూడు రోజుల విచారణలో మాదక ద్రవ్యాల సేకరణ అలాగే వాటి వినియోగంలో పాల్గొన్న 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లను ఆమె వెల్లడించారు.

రియా ఎన్సిబికి వెల్లడించిన 25 మంది ప్రముఖుల పేర్లలో సారా అలీ ఖాన్ – రకుల్ ప్రీత్ సింగ్ – డిజైనర్ సిమోన్ ఖంబట్టా పేర్లు వినిపించగా.. సుశాంత్ ను డ్రగ్స్కు పరిచయం చేసిన అగ్రశ్రేణి చిత్రనిర్మాత పేరును వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.

బాలీవుడ్ పార్టీల తీరుతెన్నులను రియా బయటికి చెప్పేసిందట. కొకైన్ – ఎల్ ఎస్ డి- గంజాయిని సేవించే పార్టీలను తాను నిర్వహించేదని కూడా తేలింది. సుశాంత్ తో కలిసి ఇవన్నీ చేసేదానినని రియా తెలిపింది. అయితే ఈ వ్యవహారాలన్నిటా సదరు అగ్ర శ్రేణి చిత్రనిర్మాత పాత్ర గురించి రియా చెప్పేయడంతో ఇప్పుడు ఆయనెవరు? అంటూ ఆరాలు మొదలయ్యాయి.

రకరకాల ప్రశ్నలకు సమాధానమిచ్చిన రియా సినీ పరిశ్రమలో ఎంతవరకు మాదకద్రవ్య దుర్వినియోగం జరిగిందో వెల్లడించింది. అలాగే సుశాంత్ సింగ్ లోనావ్లా ఫామ్ హౌస్ ను అతని బి-టౌన్ స్నేహితులు ‘డ్రగ్ పార్టీల’ కోసం ఉపయోగించారని రియా వెల్లడించింది.

అలాగే తాజాగా మహారాష్ట్ర రాజకీయ నాయకుడికి చెందిన ఒక ఫామ్హౌస్ పార్టీని సిబిఐ పరిశీలిస్తోంది. దిశా సాలియన్ – సుశాంత్ సింగ్ మరణం మధ్య ఉన్న సంబంధాన్ని దర్యాప్తు చేయాలనుకుంటున్నందున ఆ పార్టీకి హాజరైనవారి పేర్లను సిబిఐ కనుగొందిట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *