అటు కృష్ణ.. ఇటు గోదావరి.. జలాల సమస్య

thesakshi.com   :    ఏపీ, తెలంగాణ మధ్య నీటి సమస్య   కొనసాగుతోంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. తెలంగాణ ప్రాజెక్టులను సైతం ఏపీ తప్పుబట్టుతోంది. కృష్ణా, గోదావరి నదులపై తెంగాణ ఎన్నో అక్రమ ప్రాజెక్టులను నిర్మిచిందంటూ నదీ జలాల యాజమాన్య బోర్డులకు ఫిర్యాదు చేసింది.

సోమవారం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుతో పాటు గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్ బోర్డుకు సైతం ఏపీ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ లేఖరాశారు.

ఎలాంటి డిపిఆర్ లు ఇవ్వకుండా అపెక్స్ కమిటీ అనుమతులు లేకుండా తెలంగాణ అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టిందని ఆరోపించారు.

గోదావరి వాటర్ డిస్ఫూట్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణ కింది రాష్ట్రాల ప్రాజెక్టులపై ఎటువంటి ప్రతికుల ప్రభావం ఉంటుందో చూడకుండా అనేక నిర్మాణాలు చేపట్టిందని ఏపీ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇప్పటికే కాళేశ్వరం 225 నుండి 450 టీఎంసీ లకు, సీతారామ 70 నుండి 100 టీఎంసీ  లకు సామర్ధ్యం పెంచినట్లు తెలుస్తోందని.. ఆయా ప్రాజెక్టులకు అడ్డుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని అతిక్రమించి ప్రాజెక్టులు చేపడుతోందని కేఆర్ఎంబి కి, జఆర్ఎంబికి ఏపీ ఏపీ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఫిర్యాదు చేశారు.

మిగులు జలాలు ఉన్నాయంటూ విభజన చట్టానికి వ్యతిరేకంగా, 5 కొత్త ప్రాజెక్టులు తెలంగాణ చెప్పట్టిందని అందులో పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్, సిడబ్యుసి, కేఆర్ఎంబి అనుమతి లేకుండానే ప్రాజెక్టులు చేపట్టిందని వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్‌లు సమర్పించాలని కేంద్రం గతంలోనే కోరిందని.. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్‌లు సమర్పించలేదని ఏపీ అధికారులు లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు వారిగా వాడుకున్న నీటి లెక్కలతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఇచ్చిన అనుమతుల వివరాలను కేఆర్ఎంబి చైర్మన్‌కు అందించారు ఏపీ అధికారులు.

వాటాలకు మించి తెలంగాణ ప్రభుత్వం నీటి వినియోగం, నూతన ప్రాజెక్టుల నిర్మాణం పై కేంద్రానికి, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు ఫిర్యాదు చేసిన పట్టించు కోలేదని అన్నారు.

ఇక ఏపీకి కేటాయించిన నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ 881 ఫీట్ దగ్గర మాత్రమే నీటిని తీసుకు వెళ్ళడానికి ఆస్కారం ఉందని చెప్పారు. 881 ఫీట్ నీళ్లు సంవత్సరంలో కేవలం 15 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు.

కేఆర్ఎంబి ఇరు రాష్టాలకు నీటి కేటాయింపుల్లో భాగంగా తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మాదిరిగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపి చేపట్టిందని వివరించారు.

దీనిపై తెలంగాణ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందని ఫిర్యాదు చేశారు ఏపీ అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *